జీవశాస్త్రంలో ఐరోపాలోని అత్యుత్తమ శాస్త్రవేత్తగా నిలిచిన మహిమా స్వామి!
బెంగళూరుకు చెందిన డాక్టర్ మహిమా స్వామి డూండీ విశ్వవిద్యాలయం అత్యంత గౌరవనీయులైన వారి స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లోని నిపుణుల్లో ఒకరు. ఆమె రోగనిరోధక ప్రతిస్పందనలను పరిశోధించే పరిశోధనా బృందానికి నాయకత్వం వహిస్తుంది.
రివార్డు కూడా..
ప్రతిష్టాత్మకమైన యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ ఆర్గనైజేషన్ (ఈఎమ్బీఓ) యంగ్ ఇన్వెస్టిగేటర్ నెట్ వర్క్ లో చేరడానికి ఒక భారతీయ శాస్త్రవేత్త ఎంపికయ్యారు. ఆమె ఐరోపాలోని జీవశాస్త్రంలో అత్యుత్తమ ప్రతిభావంతురాలిగా గుర్తించబడింది. బెంగళూరుకు చెందిన డాక్టర్ మహిమా స్వామి మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ప్రొటీన్ ఫాస్పోరైలేషన్, యుబిక్విటిలేషన్ యూనిట్ పరిధిలో ఉంది. మహిమా ఈఎమ్బీఓ ప్రోగ్రామ్‌లో 390 మంది మాజీ సభ్యులు, 23మంది ప్రస్తుత సభ్యులు ఉన్న నెట్ వర్క్‌లో 23మంది ఇతర పరిశోధకులతో కలిసి పని చేయనుంది. ఈఎమ్బీఓ యంగ్ ఇన్వెస్టిగేటర్ ప్రోగ్రామ్ గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్నది. దీని ద్వారా రెండు సంవత్సరాల పాటు 15వేల యూరోల అవార్డును, సంవత్సరానికి 10వేల యూరోలను అందుకుంటారు. అదనపు గ్రాంట్ ల కోసం దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.
అత్యాధునికంగా..
‘ఈ నెట్ వర్క్ లో భాగమైనందుకు, యూరప్ అంతటా అత్యాధునిక పరిశోధనలు చేస్తున్న డైనమిక్ శాస్త్రవేత్తలందరినీ కలుసుకున్నందుకు నేను సంతోషిస్తున్నా. ఈ గౌరవప్రదమైన నెట్ వర్క్ లో నేను భాగం కావడం, మా పరిశోధనలకు ఎంతో సహాయపడుతుందని నేను నమ్ముతున్నా. నాకు ఈ అవార్డు అందించినందుకు నా ల్యాబ్, నా సలహాదారులకు చాలా కృతజ్ఞురాలిని’ అని మహిమా తెలిపింది. మహిమా ప్రేగు వ్యాధుల అధ్యయనం, ఇన్ఫెక్షన్ లేనప్పుడు శరీరం రోగ నిరోధక వ్యవస్థ గట్ లైనింగ్ పై దాడి చేయడం ద్వారా వీటిని ఎలా రక్షించుకోవచ్చనేది ఆమె పరిశోధన లక్ష్యం. అంతేకాదు.. చికిత్స, ఈ వ్యాధి పట్ల మెరుగైన అవగాహన, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి, పెద్ద ప్రేగు క్యాన్సర్ నిర్ధారణకు దోహదం చేసే అంశాల మీద పరిశోధనలు చేయనుంది.
ఇవి కూడా చదవండి :
ఈ భార్య కాకపోతే ఆ భార్య.. పవన్‌పై జగన్ ఫైర్
న్యూ ఇయర్ ఆంక్షలు.. హైదరాబాదీలు తెలుసుకోవాల్సినవి..