అందమైన, ఆరోగ్యమైన చర్మం ఎప్పుడూ అందరికీ కావాలి. చర్మం ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్ గా అందంగా కూడా కనిపిస్తుంది. బాడీలో అన్ని పార్ట్ ల లాగే చర్మం కాంతివంతం అవ్వాలంటే ఫుడ్డే ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన, అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అంతేనా.. అందుకోసం కొన్ని మసాలా దినుసులని కూడా సూచిస్తున్నారు. వీటిని తినడం వల్ల మంచి మెరిసే చర్మం మీ సొంతమవుతుందని చెబుతున్నారు.
భారతీయ వంటకాలు మసాలాలు లేకుండా ఉండవు. మనం వాడే ఒక్కో మసాలా ఒక్కో స్పెషల్. అవి కేవలం మంచి వాసన, రుచే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.ఈ మసాలాకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే పక్క దేశాలకి మన మసాలా ఎగుమతి అవుతుంటాయి. ఆరోగ్య ప్రయోజనాలే కాదు. వీటి వల్ల అందం కూడా మెరుగవుతుంది. అందాన్నిచ్చే ఆ మసాలా దినుసులు ఏంటి? వాటి ప్రత్యేక గుణాలు ఏంటో చూద్దామా.
పసుపు:
ఇది అన్నింటికన్నా ముఖ్యమైన స్పైస్. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.ఇది చర్మాన్ని క్లియర్ గా ఉంచడంలో సాయపడుతుంది. దీన్ని కూరలు, సూప్స్, ఇతర వంటకాల్లో వాడండి. చర్మానికి నేరుగా రాసుకున్నా కూడా చాలా మంచిది.
జీలకర్ర:
జీలకర్ర భారతీయ వంటల్లో సాధారణంగా ఉపయోగించే మరో మసాలా. పసుపులా ఇది కూడా చర్మాన్ని క్లియర్‌గా ఉంచడంలో సాయపడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అన్నం, కూరగాయలు, మాంసంలో జీలకర్రని వాడితే మంచిది. వీటిలో ప్రత్యేక గుణాలు మన అందాన్ని అమాంతం పెంచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
యాలకులు:
యాలకులు కూడా మంచి వాసన, రుచి కలిగిన మసాలా పదార్థం. దీనిని ఎక్కువగా స్వీట్స్ తయారీల్లో వాడతారు. అయితే వంటకాలకు రుచిని మాత్రమే కాదు, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి.
మెంతులు:
మెంతులు మొటిమలని పొగొడతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది చర్మాన్ని క్లియర్ చేస్తుంది. మెంతులని కూరలు, అన్నం వంటకాలల్లో చేర్చొచ్చు. సో వీటిని తినడం వల్ల మీరు క్లియర్ స్కిన్ పొందుతారు.