Indian Spiritual leader Sadguru jaggi Vasude talks Telangana Minister KTR WEF Davos
mictv telugu

కేటీఆర్‌తో జగ్గీ వాసుదేవ్ భేటీ.. సేవ్ సాయిల్ సూపర్

May 24, 2022

Indian Spiritual leader Sadguru jaggi Vasude talks Telangana Minister KTR WEF Davos

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పలువురు రాజకీయ నాయకులతో సమావేశమవుతున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరుగుతున్న సదస్సులో ఆయన తెలంగాణ పెవిలియన్‌లో ఐటీ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. పర్యావరణ పరిరక్షణ కోసం జగ్గీ వాసుదేవ్ చేపట్టిన ‘సేవ్ సాయిల్’ కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రశంసించారు.

ఈ అంశంపై ఇద్దరూ చర్చించారు. పర్యావరణ పరిరక్షణ కోసం, రైతు ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలను కేటీఆర్ వాసుదేవ్‌కు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సమాజంలో మార్పు తెస్తోందని వాసుదేవ్ ప్రశంసించారు. పర్యావరణ సమస్యలను ప్రపంచ దేశాధినేతల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం కనుగొనడానికి వాసుదేవ్ కృషి చేస్తున్నారు.