భారతీయ విద్యార్ధుల్లారా.. తలదాచుకోండి - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయ విద్యార్ధుల్లారా.. తలదాచుకోండి

February 24, 2022

04

ఉక్రెయిన్‌లో ఉండిపోయిన భారతీయ విద్యార్ధులందరు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లి తలదాచుకోవాలని అక్కడి భారత రాయబార కార్యాలయం భారతీయ విద్యార్ధులకు ముఖ్యమైన సూచనలను చేసింది. “ప్రస్తుతం ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ప్రశాంతంగా ఉండాలి. భారతీయులంతా ఎక్కడున్నా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలి. ఇల్లు, హాస్టల్ లేదా ప్రయాణాల్లో ఉన్నా భద్రంగా ఉండాలి” అని సూచన చేసింది.

అంతేకాకుండా కీయివ్‌కు వెళ్లేవాళ్లు, కీయివ్ నుంచి వేరే సిటీలకు వెళుతున్న వారు వెంటనే తమ తమ ఇళ్లకు వెనక్కు వెళ్లిపోవాలని సూచించింది. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పేర్కొంది. ఉక్రెయిన్‌లోని పాశ్చాత్య దేశాల సరిహద్దుల వెంబడి ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్లు ఇస్తామని తెలిపింది.