గోవాలో బ్రిటీష్ మహిళకు మసాజ్.. భర్త ముందే అత్యాచారం - MicTv.in - Telugu News
mictv telugu

గోవాలో బ్రిటీష్ మహిళకు మసాజ్.. భర్త ముందే అత్యాచారం

June 7, 2022

కొందరు వ్యక్తులు అత్యాచారాలతో దేశం పరువు తీస్తున్నారు. స్థానిక మహిళలే కాకుండా పర్యటనకు వచ్చిన విదేశీ మహిళలను కూడా వదలట్లేదు. ఇటీవలే రష్యా బాలికపై అత్యాచారం జరుగగా, తాజాగా పర్యటనకు వచ్చిన బ్రిటీష్ మహిళపై టూరిస్టు గైడ్ అత్యాచారం చేశాడు. ఈ ఘటన జూన్ 2న జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రిటన్‌కు చెందిన ఓ జంట గోవా పర్యటనకు వచ్చారు. వీరికి పరిసర ప్రాంతాలను చూపించడానికి విన్సెంట్ డిసౌజా అనే వ్యక్తి టూరిస్టు గైడుగా వ్యవహరించాడు. ఈ క్రమంలో ఫేమస్ బీచ్ అయిన అరాంబోల్ బీచ్‌కి తీసుకెళ్లాడు. అక్కడే మసాజ్ చేయిస్తానంటూ భర్త కళ్ల ముందే లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయాన్ని బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా బ్రిటన్‌లో ఉన్న తమ బంధువుల సలహా తీసుకున్నారు. అనంతరం భారత్‌లోని బ్రిటన్ ఎంబసీని సంప్రదించి వారి సహాయం తీసుకొని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. కాగా, కొద్ది రోజుల క్రితం హైదరాబాదు జూబ్లీహిల్స్‌లో రొమేనియా మైనర్ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే.