చైనా కక్ష్యసాధింపు.. భారతీయ వెబ్‌సైట్లపై నిషేధం - MicTv.in - Telugu News
mictv telugu

చైనా కక్ష్యసాధింపు.. భారతీయ వెబ్‌సైట్లపై నిషేధం

June 30, 2020

Indian Websites.

భారత్‌లో 59 చైనా యాప్స్‌ను నిషేధించడంతో చైనా కూడా కక్ష్య సాధింపు చర్యలకు పూనుకుంటోంది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రభుత్వం హైటెక్ విన్యాసాలతో ప్రజలకు సమాచారం అందకుండా ముమ్మరంగా కృషిచేస్తోంది. బీజింగ్‌లో భారతీయ టీవీ చానళ్ళ ప్రసారాలు ప్రసారం కాకుండా రెండు రోజుల నుంచి కట్టడి చేస్తోందని దౌత్య వర్గాలు తెలిపాయి. బీజింగ్‌లో ఇండియన్ టీవీ చానళ్లు ఐపీ టీవీ ద్వారా మాత్రమే ప్రసారమవుతున్నాయని పేర్కొన్నాయి. దౌత్య వర్గాల సమాచారం మేరకు.. రెండు రోజుల నుంచి ఎక్స్‌ప్రెస్ వీపీఎన్ నుంచి ప్రసారం కావడం లేదు. భారతీయ టీవీ ఛానెళ్ల ప్రసారాలను ఐఫోన్లు, డెస్క్‌టాప్‌లలో చూడకుండా చేశారు. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్) సర్వర్లతో శక్తిమంతమైన సెన్సార్‌షిప్‌ను అధిగమించి ఏ చానల్‌ అయినా చూడొచ్చు. అలాంటిదాన్ని కట్టడి చేయగలిగే అడ్వాన్స్‌డ్ ఫైర్‌వాల్‌ను చైనా తయారు చేసింది. 

దీంతో భారతీయ చానళ్ళ ప్రసారాలను అడ్డుకుంటోంది. సీఎన్ఎన్ లేదా బీబీసీ ప్రసారాల్లో ఎప్పుడైనా ‘హాంగ్ కాంగ్ ప్రొటెస్ట్’ అని వచ్చిందంటే.. ఇక బీజింగ్‌లో స్క్రీన్స్ బ్లాంక్ అయిపోతాయి. ఆ అంశంపై కథనం పూర్తయిపోయేదాకా అలాగే బ్లాంక్‌గా ఉండిపోతాయి. ఆ టాపిక్ పూర్తయిన తర్వాత ఇతర అంశం వచ్చినపుడు మాత్రమే కనిపిస్తుంది. కాగా, ఇంతటి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్ మంచి బుద్ధే చెప్పిందని నెటిజన్లు అంటున్నారు. చైనా ఫోన్లను కూడా నిషేధించాలనే డిమాండ్లు వినబడుతున్నాయి.