భళారే రోహిత్.. బంగ్లాపై భారత్ గెలుపు - MicTv.in - Telugu News
mictv telugu

భళారే రోహిత్.. బంగ్లాపై భారత్ గెలుపు

November 7, 2019

rohit sharma.

తొలి మ్యాచ్‌ పగ ఈ రోజు తీరింది. రాజ్‌కోట్‌లో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. రోహిత్ శర్మ చెలరేగడంతో భారత్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ విసిరిన 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా 15.4 ఓవర్లలో దాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (43 బంతుల్లో 85; 6×4, 6×6) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును నల్లేరుపై బండిలా సాగించాడు. ముస్తాఫిజుర్ వేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 15 పరుగులు  చేశాడు. అఫిఫ్ హుస్సేన్ వేసిన 8వ ఓవర్ తొలి బంతినే సిక్స్‌గా మార్చి అర్ధశతకం రాబట్టుకున్నాడు.  అమినుల్ ఇస్లాం వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి డీప్ మిడ్ వికెట్‌లో  క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక  కేఎల్ రాహుల్ (8), శ్రేయాస్ అయ్యర్ (24) మరో 26 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించేశారు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 31 పరుగులు చేశాడు. అంతకు ముందు బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు నమోదు చేసింది. తాజా విజయంతో భారత్ మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. రెండు జట్ల మధ్య ఆఖరి మ్యాచ్ ఈ నెల 10న నాగ్‌పూర్‌లో ఉంటుంది. రెండు పోటాపోటీగా ఉండడంతో దీనిపై ఆసక్తి రేగుతోంది.