ఇంగ్లాండుతో ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన టీ20 మ్యాచులో భారత్ 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకున్న భారత్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అంచనాలను పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ నిలబెట్టింది. రేణుకా సింగ్ ఠాకూర్ 4 ఓవర్లలో15 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసింది. ఫలితంగా టీ20 ప్రపంచకప్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలిచింది. అయితే మిగతా బౌలర్లు ప్రభావం చూపకపోవడంతో ఇంగ్లాండ్ 150 పరుగుల భారీ స్కోర్ చేసింది. శిఖా పాండే, దీప్తి శర్మ తలా ఒక వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో నాట్ బ్రంట్ హాఫ్ సెంచరీ, అమీ జోన్స్ 40 పరుగులతో బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన భారత్ 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు మాత్రమే చేసింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధన అర్ధసెంచరీతో రాణించింది. 41 బంతుల్లో 52 పరుగులు చేసిన స్మృతి మంధన.. సిక్సుతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అక్షర్ పటేల్ కూడా ఇలాగే చేయడంతో ఒకేరోజు ఇద్దరు భారత క్రికెటర్లు రికార్డు నెలకొల్పినట్టయింది. మరో బ్యాటర్ రిజా ఘోష్ 47 (33 బంతుల్లో 2 సిక్సలు, 4 ఫోర్లు) పరుగులతో చివరి ఓవర్‌లో రెచ్చిపోయినా ఓటమిని తప్పించలేకపోయింది. అటు ఈ మ్యాచ్ ఓడిపోవడంతో భారత్ సెమీస్ అవకాశాలకు ఒకింత ప్రభావం పడింది. అటు ఇంగ్లండ్ ఈ గెలుపుతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది.