భారత్-కివీస్ తొలి టీ20 రద్దు - MicTv.in - Telugu News
mictv telugu

భారత్-కివీస్ తొలి టీ20 రద్దు

November 18, 2022

భారత్-కివీస్ మొదటి టీ 20 వర్షార్పణమయ్యింది.. వెల్లింగ్టన్ లో భారీ వర్షం కురవడంతో మ్యాచ్ రద్దు చేశారు. కుండపోత వర్షం కారణంగా టాస్ పడకుండానే మ్యాచ్ రద్దైంది. సుమారు రెండున్నరగంటలు వేచి చూసిన వరణుడు కనికరించకపోవడంతో మ్యాచ్‌ను నిర్వహించే అవకాశం లేకుండాపోయింది. రెండో టీ20 మంగనూయి వేదికగా ఆదివారం జరగనుంది.

ఈ సిరీస్‌లో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. టీ20లకు హార్దిక్ పాండ్య, వన్డేలకు శిఖర్ ధావన్ కెప్టెన్స్ గా వ్యవహరిస్తున్నారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌కు దూరమయ్యారు. భారత్ యువ ఆటగాడు శుభమన్ గిల్ కెరీర్‌లో మొదటిసారి భారత్ టీ20 జట్టుకు సెలెక్ట్ అయ్యాడు.