భారతీయులు ఎక్కువగా అవే కొంటున్నారు.. అందుకే అంతలా మండుతున్నయ్ - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయులు ఎక్కువగా అవే కొంటున్నారు.. అందుకే అంతలా మండుతున్నయ్

June 25, 2022

యువతరం ఎక్కువగా ఉన్న భారత దేశంలో సంపాదనా పరులు కూడా ఆ స్థాయిలోనే ఉన్నారు. అయితే వీరంతా తమ సంపాదనను ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు? అనే విషయంపై రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ అధ్యయనం చేసింది. ఈ మధ్య కాలంలో లాభాలు చూపిస్తున్న రియల్ ఎస్టేట్ రంగంలోనే దాదాపు సగం వరకు పెట్టుబడులు పెడుతున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. ఆ తర్వాత బ్యాంకు డిపాజిట్లు, బంగారం, బీమా ఉత్పత్తులలో పెట్టుబడి పెడుతున్నట్టు తేల్చింది. తర్వాతి స్థానంలో పీఎఫ్, పెన్షన్, ఈక్విటీ రూపంలో దాచుకుంటున్నారు. గణాంకాల వారీగా చూస్తే.. 2022లో భారతీయుల మొత్తం ఆస్తులు 10.70 ట్రిలియన్ డాలర్లు కాగా, అందులో 49.4 శాతం రియల్ ఎస్టేట్, 15.10 శాతం బ్యాంకుల్లో, 15 శాతం బంగారం, 6.20 శాతం బీమా రూపంలో కలిగి ఉన్నారు. ఇక నగదు రూపంలో 3.5 శాతం ఉన్నట్టు సంస్థ పరిశోధనలో పేర్కొంది.