శాఖాహారంతో ఇఫ్తార్ విందు.. గిన్నీస్ రికార్డ్ - MicTv.in - Telugu News
mictv telugu

శాఖాహారంతో ఇఫ్తార్ విందు.. గిన్నీస్ రికార్డ్

May 21, 2019

Indian’s charity in UAE enters Guinness World Records for holding longest iftar.

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేపడతారు. ఆకాశంలో నెలవంక చూసినప్పటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం అవుతుంది. దీక్షలు చేపట్టిన ముస్లింలు సూర్యాస్తమయం తర్వాతే దీక్ష విరమించి ఆహారాన్ని తీసుకుంటారు. ఖీర్, ఖర్చూరం  తీసుకుని ఉపవాసాన్ని ముగిస్తారు. ఉదయం పూట ఆహారం తీసుకోవడాన్ని ‘సహర్’ అని, సాయంత్ర దీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని ‘ఇఫ్తార్’ అని అంటారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో పవిత్రతో దీక్షలు చేపడుతుంటారు.

కాగా ఇఫ్తార్ విందులో ఓ చారిటీ సంస్థ గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించింది. దుబాయ్ పారిశ్రామిక పార్కులో భారతీయుల పీసీటీ హ్యుమానిటీ చారిటీ సంస్థ మొత్తం 7 రకాల శాఖాహార వంటలతో కిలోమీటర్ పొడవునా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి, గిన్నీస్ బుక్ రికార్డు సాధించింది. ఈ సందర్భంగా చారిటీ సంస్థ సభ్యులు మాట్లాడుతూ.. శాఖాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఇలా చేయడం వల్లన జంతువధను కూడా అరికట్టవచ్చన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు.