Indians do not need police clearance certificate for Saudi Arabia visa
mictv telugu

ఇండియన్లకు సౌదీ గుడ్ న్యూస్.. వీసాకు పోలీస్ క్లియరెన్స్ అక్కర్లేదు

November 17, 2022

Indians do not need police clearance certificate for Saudi Arabia visa

ఎడారి దేశమైన సౌదీ అరేబియా భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి సౌదీ వెళ్లాలనుకునే వారు వీసా కోసం పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆ సర్టిఫికెట్ లేకుండానే తమ దేశం రావొచ్చని, భారత్‌‌తో ఉన్న బలమైన సంబంధాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.

ఈ మేరకు భారత్‌‌లోని సౌదీ రాయబార కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తాజా చర్య వల్ల ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న బంధం మరింత బలపడుతుందని పేర్కొంది. తమ దేశంలో దాదాపు 20 లక్షల మంది భారతీయులు ప్రశాంతంగా జీవిస్తున్నారని వివరించింది. కాగా, తాజా నిర్ణయంతో సౌదీ వెళ్లాలనుకునే కార్మికులు, ఉద్యోగులకు వీసా ప్రక్రియ సులభతరం కానుంది. అంతేకాక, పర్యాటకులకు కూడా సర్టిఫికెట్ల భారం తగ్గనుంది. అటు సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఈ నెలలో భారత్ పర్యటనకు రావాల్సింది కానీ అనివార్య కారణాల వల్ల అది రద్దయింది.