చలికి తట్టుకోలేక స్వెటర్లు, మంకీ క్యాప్స్ ధరించడం మామూలే! వాటి ధర ఎంత ఉంటాయి.. మామూలుగా అయితే వందల్లో ఈ క్యాప్స్ లభిస్తాయి. కానీ ఈ మంకీ క్యాప్ ధర అక్షరాలా 40వేల రూపాయలు. డిస్కౌంట్ లో 31,990 రూపాయలకు వస్తుందట.
క్యాప్ లందు మంకీ క్యాప్ లు వేరయా అన్నారు పెద్దలు. చలి తట్టుకోవడానికి తల, చెవులు, మెడ ప్రాంతాన్ని కప్పేసేలా, కావాలనుకుంటే నోటిని కూడా మూసేలా ప్రత్యేకమైన స్టైల్ తో డిజైన్ చేయబడి ఉంటాయి. ఇందులో కూడా రకాలున్నాయండోయ్! బీనీ స్టైల్ క్యాప్ అందులో ఒకటి. పాశ్చాత్య దేశాల్లో వీటిని స్కీ మాస్క్ క్యాప్స్ గా పిలుస్తుంటారు. ఇక ఉత్తర భారతదేశంలో అయితే వీటిని ‘బందర్ టోపీ’ అని ముద్దుగా పిలుస్తుంటారు.
చిన్న పిల్లల కోసం వీటిని మన దగ్గర వాడుతుంటారు. వాళ్లు పెద్దగా ఇష్టపడినప్పటికీ బలవంతంగా అయిన ఈ చలికి తట్టుకోవడానికి పెడుతుంటారు. ఇలాంటి క్యాప్స్ గురించి స్వాతి మోయిత్రా అనే ట్విట్టర్ వినియోదారిని గబ్బానా ‘స్కీ మాస్క్ క్యాప్’ ని డిస్కౌంట్ కి అమ్ముతున్నారని ఫొటోతో సహా పెట్టింది. ఒక లగ్జరీ ఫ్యాషన్ వెబ్ సైట్ ఈ క్యాప్ ని 31, 990 రూపాయలకు అమ్ముతున్నట్లు వెల్లడించింది. అంతేకాదు.. దీని అసలు ధర 40వేల రూపాయలట. ఖాకీ రంగు ‘స్కీ మాస్క్ క్యాప్’ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.
ఈ ట్వీట్ పై ఒక వినియోగదారుడు.. ‘తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఇంత ధర పెట్టి కొనాలంటే కొద్దిగా ఆలోచించాల్సిందే’ నంటూ రాశారు. ఒకతను మాత్రం.. ‘మంకీ క్యాప్ కోసం 31 వేలా?! నేను 20 రూపాయలు పెట్టి 10 సంవత్సరాల క్రితం ఒక క్యాప్ ని కొన్నాను. ఇప్పటికీ అది నాకు బాగానే పని చేస్తుంది’ అంటూ వెటకారంగా కామెంట్ పెట్టాడు. అయితే మంకీ క్యాప్ లను అధిక ధరలకు విక్రయించడం ఇదేం మొదటిసారి కాదు. గతేడాది అమెరికాకు చెందిన షాప్ వ్యాలీ మంకీ క్యాప్ 2,290 రూపాయలకు విక్రయించడం అప్పట్లో వైరల్ గా మారింది.