భారతీయులు ఎక్కువగా చూసేది టీవీ కాదు.. ఆన్‌లైన్లో.. - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయులు ఎక్కువగా చూసేది టీవీ కాదు.. ఆన్‌లైన్లో..

October 4, 2018

పది, పదిహేనళ్ల కిందటి ముచ్చట.. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు అంతగా వ్యాప్తిలోకి రాని కాలం.. అందరూ టీవీలకు జలగల్లా అతుక్కుపోయేవారు. కానీ కాలం బాగా మారిపోయింది. మనుషులు కూడా మారిపోయారు. టీవీల ముందు కూర్చోవడం తగ్గింది. ఫోన్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. నమ్మబుద్ది కావడం లేదు కదా.  ఫోన్లో ఏం చేస్తారు అంతసేపు అనుకుంటున్నారు కదా? టీవీలను బై చెప్పి ఎంచక్కా వీడియోలు చూస్తున్నారు.ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో భారతీయులు టీవీలు చూడటం బాగా తగ్గించి, ఆన్‌లైన్‌ వీడియోలే ఎక్కువగా చూస్తున్నారని వెల్లడైంది. అంతర్జాతీయ కంటెంట్ సరఫరా కంపెనీ లైమ్లైట్ నెట్వర్క్స్ నిర్వహించిన సర్వేలో సంగతులు వెల్లడయ్యాయి.

rr

2018 ఆన్‌లైన్ వీడియో వీక్షణ ప్రపంచ సగటు వారానికి ఆరుగంటల 45 నిమిషాలు ఉంటే మనదేశంలో అది ఎనిమిది గంటల 28 నిమిషాలు. 2016తో పోలిస్తే పెరుగుదల 58 శాతం. వీడియోల్లో  సగభాగం సినిమాలు చూస్తుంటే మిగతా సగభాగం వార్తలు, టీవీషోలు, క్రీడలు వంటివి ఉన్నాయి. ‘ఆన్‌లైన్‌లో అన్ని విషయాలపైనా వీడియోలు అందుబాటులో ఉన్నాయి. జనం వాటిపై మొగ్గుచూపుతున్నారు. ఈ వీడియోలు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా చూసేందుకు వీలుంటుంది. కావాలంటే డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. అందుకే టీవీలు వెనుకపట్టు పట్టాయి’ అని లైమ్లైట్ నెట్వర్క్స్ సీనియర్ అధికారి జహీర్ అబ్బాస్ అన్నారు.

కాగా ఆన్ లైన్ వీడియోలు చూడటంలో ఫిలిప్పీన్స్ దేశం మొదటి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో భారత్, అమెరికా ఉన్నాయి. అయితే టీవీ.. ఆన్‌లైన్ వీడియోలతో పోలిస్తే ఒక విషయంలో మాత్రం బెటర్ అని తేలింది.   వీడియోల బఫర్ టైం ఎక్కుగా ఉండడం చాలా విసుగెత్తిస్తోందని యూజర్లు ఆరోపించారు. వయసు పెరిగే కొద్ది వీడియోలు చూసే వారి సంఖ్య తగ్గుతూ వస్తుందని ఈ సర్వే ద్వారా తెలిసింది.