Indians tragedy in Maldives capital male fire accident
mictv telugu

9 మంది భారతీయుల సజీవదహనం…

November 10, 2022

ప్రముఖ పర్యాటక దేశం మాల్దీవుల్లో ఘోరం జరిగింది. దేశ రాజధాని మాలేలో ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు సహా మొత్తం 11 మంది సజీవదహనమయ్యారు. విదేశాలకు చెందిన వలస కార్మికులు నివసించే భవనంలో ఈ ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లోని వాహనాల గ్యారేజీలో లేచిన మంటలు భవనమంతా వ్యాపించాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో అప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టలేకపోయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భవనాల్లో భద్రత లేదని, వలసకార్మికుల గోడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.