భారతీయులకు గుడ్ న్యూస్..బ్రెజిల్‌ ప్రధాని - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయులకు గుడ్ న్యూస్..బ్రెజిల్‌ ప్రధాని

October 25, 2019

Brazil.

భారతీయ పర్యాటకులకు, వ్యాపారులకు బ్రెజిల్ ప్రధాని జేర్‌ బోల్సోనారో శుభవార్త తెలిపారు. చైనా పర్యటనలో ఉన్న ఆయన.. భారతీయు పర్యాటకులు వీసా లేకుండానే తమ దేశానికి రావచ్చని తెలిపారు. అమెరికా, కెనడా, జపాన్‌, ఆస్ట్రేలియా దేశస్తులకు కూడా బ్రెజిల్ దేశం ఈ సదుపాయాన్ని కల్పించింది. 

కొత్తగా భారత్‌తో పాటు చైనాను కూడా ఆయన ఈ జాబితాలో చేర్చారు. ఈ దేశాలు మాత్రం బ్రెజిల్‌ పౌరులకు వీసా లేకుండా వచ్చే అవకాశాన్ని కల్పించలేదు. జేర్‌ బోల్సొనారో గతేడాది బ్రెజిల్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో పలుసార్లు జాతి విద్వేష వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన దాఖలాలున్నాయి. ఇటీవల అమెజాన్‌ అడవిలో కార్చిచ్చుపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ఎన్‌జీవోల వల్లే ఈ మంటలు చెలరేగాయని నోరు పారేసుకున్నారు.