కృత్రిమ మేధతో పనిచేసే ఇంటర్నెట్ సెర్చింజన్లలో మరో కీలక మలుపు. మనదేశంలోనూ తొలిసారిగా దేశీ టచ్ ఉన్న చాట్ బాట్.. లెక్సీ పేరుతో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ వెలాసిటీ దీన్ని ప్రారంభించింది. ఇది ఓపెన్ ఏఐ చాట్ జీపీటీతో అనుసంధానమైన భారతదేశపు మొట్టమొదటి ఏఐ చాట్ బాట్. చాట్ జీపీటీ రెండు నెలల్లోనే 100 మిలియన్ల వినియోగదారులను చేరుకుంది. 590 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
లెక్సీ గురించి వెలాసిటీ సోమవారం తన అధికారిక బ్లాగ్‌లో ప్రకటన చేసింది. ‘మేం ఇ-కామర్స్ వ్యవస్థాపకులకు నివేదికలు, ఇతర సమాచారం అందించడానికి ప్రయత్నిస్తాం. చాట్ జీపీటీ ప్రారంభించినప్పటినుంచి మా ప్రొడక్షన్ బృందాలు కస్టమర్లకు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. సరైన వ్యాపార నిర్ణయాలను తీసుకోడానికి ఉపయోగపడేలా ఇంటర్‌ఫేస్‌తో ChatGPTని ఇంటిగ్రేట్ చేశాం’’ అని వెలాసిటీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు అభిరూప్ మేధేకర్ తెలిపారు.
లెక్సీ గురించి..
-వెలాసిటీ సంస్థ ప్రస్తుత వ్యాపార విశ్లేషణ సాధనం, చాట్ జీపీటీ ఆధారిత సాధనాన్ని ఏకీకృతం చేసింది. ఇది వెలాసిటీ ప్రకారం 3వేల కంటే ఎక్కువ బ్రాండ్ల సమాచారంతో వ్యాపార నిర్ణయాలు తీసుకుంటుంది.
-బ్రాండ్స్ వాట్సాప్‌లో రోజువారీ వ్యాపార నివేదిక పంపిస్తారు. ఈ వాట్సాప్ ఇంటర్ ఫేస్‌తో బాట్ లింకై ఉంటుంది.
– సంభాషణ పద్ధతిలో వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.