పిత్తుల పోటీ.. గెలిస్తే ఎంతంటే? - MicTv.in - Telugu News
mictv telugu

పిత్తుల పోటీ.. గెలిస్తే ఎంతంటే?

September 16, 2019

India's First Farting Contest WTF begins on 22nd September in Surat.

పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అంటారు. దీనికి తగ్గట్టుగా సూరత్‌ నగరంలో ఈ నెల 22న ఓ పోటీ జరుగనుంది. మనుషులు నలుగురిలో చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యే పనిని నలుగురిలో చేయించే విధంగా ఓ పోటీని ఏర్పాటు చేస్తున్నారు. అదే పిత్తుల పోటీ. ఇండియాలో తొలిసారిగా పిత్తుల పోటీ జరుగుతుండడం విశేషం. ఈ పోటీల నిర్వాహకుడు, గాయకుడు యతిన్ సంగోయ్ మాట్లాడుతూ..‘జనాల మధ్య పిత్తడాన్ని అంతా తప్పుగా భావిస్తారు. కానీ, అది ఎంతో ఆరోగ్యవంతమైనది. శరీరంలో ఉండే గాలిని బయటకు వదిలేయడం తప్పే కాదు. మానవ శరీరంలో జరిగే చర్యల్లో ఇది కూడా ఒకటి’ అని తెలిపారు. 

ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాన్ని పంచుకున్నాడు. సుమారు 25 ఏళ్ల క్రితం నా కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూస్తుండగా.. నేను గట్టిగా పిత్తాను. దీంతో ఇంట్లో వాళ్లు గట్టిగా నవ్వారు. నన్ను పిత్తుల పోటీలకు పంపిస్తే తప్పకుండా గెలుస్తానని చెప్పారు. అప్పటి నుంచి పిత్తుల పోటీ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నా మదిలో ఉండిపోయింది. 

ఈ విషయాన్ని నా స్నేహితులతో చర్చిస్తే నవ్వేవారని యతిన్ తెలిపాడు. ఈ పోటీల కోసం అతడు ఫేస్‌బుక్‌లో ఈవెంట్ పేజీని కూడా ప్రారంభించాడు. ఈ పోటీల్లో పాల్గొనాలంటే రూ.100 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొనేవారి కోసం ప్రత్యేక ఆహారాలను సిద్ధం చేస్తున్నారు. బంగాళ దుంప, బీన్స్, పప్పు, ముల్లంగి తదితర వంటకాలను ఏర్పాటు చేయనున్నారు. పోటీదారులు అవన్నీ తిన్న తర్వాత పోటీ మొదలవుతుంది. ఇందులో ఎవరైతే లయబద్దమైన శబ్దంతో పిత్తుతారో వారే విజేతలని యతిన్ తెలిపాడు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచేవారికి రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున నగదు బహుమతులు ఇస్తామన్నాడు. దీపావళి తర్వాత అహ్మదాబాద్‌, కోల్‌కతా, ముంబయి నగరాల్లో ఈ వేడుకలు నిర్వహించాలని భావిస్తున్నామని యతిన్ తెలిపాడు.