India's First Monkeypox Case Reported In Kerala, Man Who Travelled From UAE
mictv telugu

బ్రేకింగ్.. భారత్‌లో తొలి మంకీఫాక్స్ కేసు నమోదు.. ఆ రాష్ట్రంలోనే

July 14, 2022

India's First Monkeypox Case Reported In Kerala, Man Who Travelled From UAE

దేశంలో మరో వైరస్ కలకలం రేపింది. మూడు రోజుల క్రితం విదేశాల నుంచి కేరళకు వచ్చిన ఓ వ్యక్తికి ‘మంకీపాక్స్’ సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అతడి రక్త నమూనాలను పుణె వైరాలజీ ఇన్స్టిట్యూట్కు పంపగా.. పాజిటివ్గా తేలినట్లు వెల్లడించారు. జులై 12 అతడు భారత్‌కు వచ్చినట్లు వెల్లడించారు. సదరు వ్యక్తి విదేశాల్లో మంకీపాక్స్‌ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినట్లు మంత్రి తెలిపారు.

బాధితుడిని ఐసోలేషన్‌కు తరలించి పరిశీలనలో ఉంచినట్లు చెప్పారు. అయితే మంకీపాక్స్‌కు వైద్యం ఉందని, ఎలాంటి భయం అవసరం లేదని డాక్టర్లు చెప్పినట్లు మంత్రి తెలిపారు. వైరస్‌ సోకిన వ్యక్తితో కలిసిన వారికే వ్యాప్తి చెందుతుందని, వైరాలజీ ల్యాబ్‌ నివేదిక తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. బాధితుడు దేశంలోకి వచ్చాక ఎవరినీ కలవలేదన్నారు ఆరోగ్య మంత్రి. దేశంలో మొట్టమొదటి కరోనా వైరస్ వెలుగుచూసింది కూడా కేరళలోనే. 2020, జనవరి 27 న చైనాలోని వుహాన్ నగరం నుంచి తిరిగొచ్చిన కేరళకు చెందిన ఓ మహిళకు కరోనా వైరస్ సోకింది. కాగా తొలి మంకీపాక్స్ కేసు కూడా ఆ రాష్ట్రంలోనే బయటపడింది.