India's first passenger drone will be showcased by Navy’s tableau on Republic Day
mictv telugu

మొట్టమొదటి ప్యాసింజర్ డ్రోన్ వరుణ!

January 25, 2023


పుణే డిఫెన్స్ భారతదేశపు మొట్టమొదటి ప్యాసింజర్ డ్రోన్ వరుణని రూపొందించింది. గురువారం కర్తవ్యపథ్ లో జరిగే రిపబ్లిక్ పరేడ్ లో భాగంగా నేవీ టేబుల్ లో ప్రదర్శించబడుతుంది.

నావికా దళం.. మేక్ ఇన్ ఇండియా పేరిట దాని ప్రధాన విభాగంలో హైలైట్ చేయబడ్డాయి. వరుణ… ‘ఆత్మ నిర్భర భారత్’ మిషన్ ప్రాముఖ్యతను తెలియచేస్తుంది. పుణేకు చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ నేవీ కోసం అభివృద్ధి చేసిన డ్రోన్.. వైద్య తరలింపు, నౌకల మధ్య కార్గో లాజిస్టిక్స్, డెలివరీ కోసం భూమి, సముద్రం పై ఉపయోగించవచ్చు. వరుణ ల్యాండ్ ఆపరేషన్లలో, ఫ్రంట్ లైన్ ప్రాంతాల్లో సైనికులను మోహరించడానికి కూడా ఉపయోగించవచ్చు.

కెప్టెన్ నికుంజ్ పరాశర్, సహ వ్యవస్థాపకుడు, ఎండీ, సహ వ్యవస్థాపకుడు, వైస్ ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్మెంట్) మృదుల్ బబ్బర్, డైరెక్టర్ లక్ష్య డాంగ్ డ్రోన్ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా మృదుల్ బబ్బర్ మాట్లాడుతూ.. ‘ఈ ప్యాసింజర్ డ్రోన్ ను అభివృద్ధి చేయడానికి మేము మూడు సంవత్సరాలు కష్టపడ్డాం. వరుణ 1300 కిలోల బరువు ఉన్న వ్యక్తిని 25 నుంచి 33 నిమిషాల విమాన వ్యవధి కోసం 25కి.మీ. తీసుకుంటుంది. ఇది రిమోట్ తో నియంత్రించబడుతుంది. సిస్టమ్ లోకి అందించబడిన ఆదేశాల ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది. ఈ డ్రోన్ ల్యాండ్ ట్రయల్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. దీని ఉత్పత్తికి సంబంధించి నేవీ నుంచి ఇప్పటికే రెండంకెల ఆర్డర్స్ అందాయి. విదేశీ కొనుగోలుదారుల నుంచి కూడా మాకు చాలా అభ్యర్థనలు వస్తున్నాయి. అందుకే దాని ఎగుమతులను ప్లాన్ చేస్తున్నాం’ అంటూ చెప్పాడు.

డ్రోన్ డెవలప్ మెంట్ కోసం నారీ శక్తికి క్రెడిట్ ఇస్తున్నామన్నారు మృదుల్. వరుణ కోసం లీడ్ సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్చర్ ను కోర్ మహిళా బృందం సభ్యులు అభివృద్ధి చేశారు. అత్యవసర సమయంలో సముద్రాలపై స్థిరమైన వేగంతో ప్రయాణించే రెండు యుద్ధనౌకల మధ్య నావికులు లేదా సరుకు రవాణా చేయడం నావికాదళం కోసం వరుణాన్ని అభివృద్ధి చేయడం ముఖ్య లక్ష్యం. సాధారణంగా సముద్రాలలో రెండు కదిలే నౌకల మధ్య మనుషులను, వస్తువులను మార్చడం చాలా సవాలుగా ఉంటుంది. ఇప్పటివరకు తాళ్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా ఈ రవాణా జరుగుతుంది. డ్రోన్ కృత్రిమ మేధస్సుపై పని చేస్తుంది. నాలుగు మెదడులను కలిగి ఉంటుంది. ఒక మెదడు పని చేయడం ఆపివేస్తే దానిలోకి అందించబడిన ఆదేశాలు స్వయంచాలకంగా రెండవ మెదడుకు మారుతాయి. ఒకవేళ నాలుగు మెదళ్లు పని చేయడం మానేస్తే.. బాలిస్టిక్ పారాచూట్ తెరుచుకుంటుంది. దాంతో అందులో ఉన్న వస్తువులు, ప్రయాణీకులు రక్షించబడుతారు. కంపెనీ పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది.