ఇండియా-బంగ్లాదేశ్ చారిత్రాత్మక టెస్ట్..గులాబీ వర్ణంలో స్టేడియం - MicTv.in - Telugu News
mictv telugu

ఇండియా-బంగ్లాదేశ్ చారిత్రాత్మక టెస్ట్..గులాబీ వర్ణంలో స్టేడియం

November 22, 2019

బీసీసీఐ క్రికెట్ చరిత్రలో సరికొత్త ఆవిష్కరణ జరగబోతోంది. తొలిసారి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ – ఇండియా తలపడబోతున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. రాత్రి 8 గంటల వరకు ఈ మ్యాచ్ సాగనుంది. ఈ మ్యాచ్‌లో తొలిసారి పింక్ బాల్ ఉపయోగిస్తున్నారు. దీంతో క్రికెట్ ప్రియులు ఈ పింక్ బాల్ టెస్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే స్టేడియంతో పాటు బీసీసీఐ హెడ్ ఆఫీస్ కూడా ముస్తాభయ్యాయి. బిల్డింగులు,స్టేడియం అంతా గులాబీ వర్ణాన్ని సంతరించుకున్నారు. స్టేడియానికి పరిసరాల్లో ఉన్న రోడ్లను అందమైన గ్రాఫిటీలతో ముస్తాబు చేసింది.క్రికెట్‌లో గులాబి బంతి గతంలో తొలిసారి మహిళల క్రికెట్ లో ప్రవేశపెట్టారు. తొలిసారి టీం ఇండియా ఈ బంతితో ఆడుతోంది. రెండు జట్లకు కొత్తే కావడంతో ఇప్పటికే ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా భాగానే చేశారు. 

India's First Pink.

పింక్ బాల్ ఎందుకు..?

టెస్ట్ క్రికెట్ అంటే తెల్లటి దుస్తుల్లో రెండ్ బాల్‌తో ఆడుతుంటారు. కానీ ఈసారి పింక్ బాల్ వాడుతున్నారు. దీనికి ఓ కారణం ఉంది. టెస్ట్ మ్యాచ్‌లు గతంలో పగటి పూట మాత్రమే జరిగేవి. కానీ ఈసారి డే అండ్ నైట్ మ్యాచ్ కావడంతో రాత్రి సరిగా వెలుగు ఉండదు, ఫ్లడ్‌లైట్ల కింద ఆడాల్సి ఉంటుంది. కాబట్టి బంతిని గుర్తించడం ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని అదిగమించేందుకు పింక్ బాల్ ఎంచుకున్నారు. ఈ బాల్ వెలుతురులో మెరిసిపోతూ కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఎంచుకున్నారు.