తల్లిదండ్రులవ్వడం అనేది ప్రతీ జంట కోరుకునేది. అందమైన ఆ క్షణాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూచ్తారు. లింగమార్పిడి జంటలకు ఇది కష్టం. కానీ ఒక ట్రాన్స్ జంట కల నెరవేరింది. వారి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అమ్మాయి.. అబ్బాయిగా మారడం, అబ్బాయి.. అమ్మాయిగా మారడం అనేది ప్రపంచాన్ని ఎదిరించి సాహసం చేయడమే. ఇలా లింగమార్పిడి చేసుకున్న తర్వాత వారికి సరైన తోడు దొరకడం కూడా కష్టమే. అలా దొరికిన వారు తల్లిదండ్రులవ్వడం తీరని కలే అని చెప్పొచ్చు. ఈ కేరళ ట్రాన్స్ జంట మాత్రం మార్చిలో బిడ్డను కనబోతున్నారు.
కోజికోడ్ లో అకౌంటెంట్ గా పని చేస్తున్న జహాద్ తల్లి కావడానికి థ్రిల్ కాలేదు. కానీ 23 యేండ్ల అతను దేశంలో గర్భవతి అయిన మొదటి లింగమార్పిడి పురుషుడు కావడం వల్లయవార్తలకెక్కాడు.కేరళకు చెందిన ఈ జంట ఇన్ స్టాలో వారి ఫోటోలను పంచుకున్నారు. పురుషుడిగా పుట్టి స్త్రీగా మారిన జియా, స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిన జహాద్ గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే జహాద్ స్త్రీ నుంచి పురుషునిగా మారే సమయంలోనే గర్భం దాల్చాడు. రొమ్ములను తీసివేసినప్పటికీ గర్భాశయం ఉన్నందున ఇది సాధ్యమైందని వైద్యులు చెప్పారు. ఈ దంపతులు బిడ్డకు పాల బ్యాంకు నుంచి పాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
అమ్మా అనే పిలుపు..
‘నేను పుట్టకతో లేదా నా శరీరం ద్వారా స్త్రీని కానప్పటికీ ఒక శిశువు నన్ను ‘అమ్మా’ అని పిలుస్తుందని అనుకోవడమే ఎంతో సంతోషాన్నిస్తుంది. మేం కలిసి మూడు సంవత్సరాలైంది. అతను జహాద్ తండ్రి కావాలని కోరుకున్నడు. ఈ రోజు అతని పూర్తి సమ్మతితోనే ఇది జరిగింది’ అని జియా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. వారు దత్తత తీసుకోవడానికి కూడా గతంలో ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. అయితే వీరు తల్లిదండ్రులు కావడం అనేది కూడా కష్టమైంది. దానికోసం న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. జహాద్ ముందు విముఖత చూపాడు. కానీ జియా కోరిక వల్ల ఇది సాధ్యమైంది. మొత్తానికి వీరి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.