అంధురాలని వద్దన్నారు..ఐఏఎస్ఐ తిరిగి వచ్చింది.. - MicTv.in - Telugu News
mictv telugu

అంధురాలని వద్దన్నారు..ఐఏఎస్ఐ తిరిగి వచ్చింది..

October 15, 2019

ప్రతిభ ఉన్నా వైకల్యం కారణంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న దివ్యాంగురాలు తనను అవమానించిన వారికి బుద్ధివచ్చేలా చేసింది. ఎంతో కష్టపడి ర్యాంకు సాధించి ఐఆర్‌ఏఎస్ ఉద్యోగానికి ఎంపికైతే చూపులేదని ఉద్యోగం ఇవ్వమన్నారు. వారి మాటలకు నొచ్చుకున్న ఆమె పట్టుదలతో శ్రమించి ఏకంగా ఐఏఎస్‌గా ఎంపికై.. డిప్యూటీ కలెక్టర్‌గా బాధత్యలు స్వీకరించారు.  దేశంలోనే తొలి అంధ మహిళా ఐఏఎస్‌గా ప్రంజల్ పాటిల్ రికార్డు సాధించారు. ఆమె సోమవారం తిరువనంతపురం సబ్‌కలెక్టర్‌గా నియామకం అయ్యారు. 

India...

మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌కు చెందిన ప్రంజల్ పాటిల్‌కు ఆరేళ్ల వయస్సులో కంటి చూపు పోయింది. అయినప్పటికీ కష్టపడి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ నుంచి డిగ్రీపట్టా పొందారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో చదివి 2016లో జరిగిన యూపీఎస్సీల్లో 773వ ర్యాంక్‌ సాధించారు. భారత రైల్వే అకౌంట్స్‌ సర్వీస్‌ (ఐఆర్‌ఏఎస్‌)లో ఉద్యోగం వచ్చింది. ఆమె అందురాలని తెలిసిన అధికారులు ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించారు. తన వైకల్యం కారణంగా ఉద్యోగం కోల్పోవడంతో ఎంతో నొచ్చుకున్న పాటిల్ మళ్లీ యూపీపీఎస్సీ పరీక్ష రాసి  124వ ర్యాంక్‌‌తో ఏడాది పాటు ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసుకొని తాజాగా బాధ్యతలు స్వీకరించారు.