India's great victory over Afghanistan..122 after 1020 days
mictv telugu

ఆఫ్ఘాన్‌పై భారత్ ఘన విజయం..1020 రోజుల తర్వాత 122

September 9, 2022

దుబాయ్ వేదికగా గతకొన్ని రోజులుగా ఆసియా కప్ మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి దశను పూర్తి చేసుకున్న ఆయా జట్లు సూపర్-4కి చేరుకున్నాయి. అందులో భారత్, పాక్, ఆఫ్ఘాన్, శ్రీలంక జట్లు అర్హత సాధించాయి. అయితే, ఈ సూపర్-4 నుంచి కచ్చితంగా భారత్ ఫైనల్‌కి చేరుకుంటుందని దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులంతా విపరీతమైన ఆశలు పెట్టుకున్నారు. కానీ, అభిమానుల ఆశలను భారత జట్టు అందుకోలేకపోయింది. దీంతో పాకిస్తాన్, శ్రీలంక జట్లు సూపర్-4 నుంచి ఆసియా కప్ ఫైనల్‌కి దాదాపుగా అర్హత సాధించాయి. ఈ క్రమంలో గతరాత్రి జరిగిన భారత్-ఆఫ్ఘాన్ నామామాత్రపు మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. 1020 రోజుల తర్వాత విరాట్ కోహ్లీ 122 పరుగులు చేసి, నాటౌటుగా నిలిచాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. టాస్ నెగ్గిన ఆఫ్ఘాన్..భారత జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ క్రీజులోకి అడుగుపెట్టారు. మ్యాచ్ ఆరంభం నుంచి ఇద్దరు పోటపోటీగా పరుగులు చేయటం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో కేఏల్ రాహుల్ (62) పరుగులు చేశాడు. ఇక, విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

అయితే, విరాట్ కోహ్లీ..1020 రోజుల నిరీక్షణ తర్వాత మళ్లీ సెంచరీ సాధించాడు. కోహ్లీ కెరీర్లోనే ఇది 71వ అంతర్జాతీయ సెంచరీ. టీ20 ఫార్మాట్‌లో అతనికి ఇదే మొదటిది. ఈ ప్రత్యేక శతకాన్ని కోహ్లీ.. తన భార్య అనుష్క శర్మకు, ముద్దులు కూతురు వామికాకు అంకితం చేశాడు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. కెప్టెన్‌గా వైదొలిగిన తర్వాత అనేక విషయాల్లో నా భార్య అనుష్క నాకు సహాయపడింది. బయట చాలా విషయాలు జరుగుతున్నాయని నాకు తెలుసు. కానీ, అవి నా దృక్పథాన్ని ఏ మాత్రం మార్చలేదు. సెంచరీ చేసిన తర్వాత నా ఉంగరాన్ని (పెళ్లి ఉంగరం) ముద్దాడాను. నేను ప్రస్తుతం ఇలా నిలబడటం మీరు చూస్తున్నారు. ఇందుకు కారణమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఈ క్లిష్ట సమయాల్లో నాకు అండగా నిలిచిన ఒక వ్యక్తి చేసింది నా భార్య అనుష్క. ఈ సెంచరీని ప్రత్యేకంగా అనుష్కకు, మా కూతురు వామిక అంకితం చేస్తున్నా” అని ఆయన అన్నారు.