India's largest screen launched at Hyderabad IMAX
mictv telugu

హైదరాబాద్‌లో అతి పెద్ద స్రీన్..ఆ సినిమాతోనే స్టార్ట్

November 23, 2022

India's largest screen launched at Hyderabad IMAX

హైదరాబాద్‌లో సినిమా ప్రియులకు మరో కొత్త అనుభూతిని ఇచ్చేందుకు ఐమాక్స్ సిద్ధమైంది. దేశంలోనే అతి పెద్ద సినిమా స్క్రీన్ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో ఈ స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

భారతదేశంలోనే అతిపెద్ద స్క్రీన్‌తో పాటు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్క్రీన్‌గా ఇది నిలవనుందని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యం తెలిపింది. ఈ స్క్రీన్‌ను 3D/2D ప్రొజెక్షన్ స్క్రీన్ తయారీ సంస్థ అయిన Strong MDI అభివృద్ధి చేయగా.. QSC ఆడియో ఉత్పత్తుల నుంచి స్పీకర్లు వచ్చాయి. ప్లేబ్యాక్ కోసం Dolby CP950 సౌండ్ ప్రాసెసర్ ఉపయోగించినట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. మొదటగా ఈ స్క్రీన్‌లో డిసెంబర్ 16న విడుదల కానున్న అవతార్ 2 సినిమాను ప్రదర్శించనున్నారు. దేశంలోనే అతి పెద్ద స్క్రీన్‌పై సినిమాను చూసేందుకు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.