భారత కొత్త టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా శనివారం ఢిల్లీలోని హోంమంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. హార్దిక్ పాండ్యా తన సోదరుడు కృనాల్ పాండ్యాతో కలిసి అమిత్ షాను కలిశారు. అమిత్ షాను కలిసిన ఫొటోలను పాండ్యా తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.“మమ్మల్ని ఆహ్వానించినందుకు మరియు మా కోసం సమయం కేటాయించినందుకు హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు. మిమ్మల్ని కలవడం గౌరవం” అని రాసుకొచ్చారు. అయితే పాండ్యా సోదరులు అమిత షాను ఎందుకు కలిశారని అన్నది లెలియలేదు.
ఇటీవల శ్రీలంకతో సిరీస్‌కు భారత టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేశారు. రాబోయే రోజుల్లో t20 జట్టుకు హార్దిన్ పాండ్యానే ఫుల్ టైమ్ కెప్టెన్ గా నియమిస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ సమయంలో అమిత్ షాతో..పాండ్యా భేటీ చర్చనీయాంశంగా మారింది. అమిత్ షా కుమారుడు జైషా బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నారు. అంతకుముందు గురువారం హార్దిక్ పాండ్యా ‘కెజిఎఫ్’ నటుడు యశ్‌ను కలిసిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.