Home > Featured > అణు దాడి చేయొద్దనుకున్నాం, కానీ: రాజనాథ్ 

అణు దాడి చేయొద్దనుకున్నాం, కానీ: రాజనాథ్ 

జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో భారత్, పాక్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పాక్ భారీగా సైన్యాన్ని సరిహద్దులో మోహరిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శుక్రవారం పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ వెళ్లిన రాజ్‌నాథ్‌.. అటల్‌ బిహారీ వాజ్‌పేయిప్రథమ వర్ధంతి సందర్భంగా పోఖ్రాన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అణ్వస్త్రాల వినియోగంపై మాట్లాడుతూ ‘అణ్వస్త్రాలను మొదట ప్రయోగించరాదన్నది మా దేశ విధానం. దీనికి భారత్‌ కట్టుబడి ఉంది. కానీ భవిష్యత్తు పరిణామాలపై ఏమీ చెప్పలేం’ అని అన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ కూడా చేస్తూ ‘భారత్‌ను అణ్వస్త్ర శక్తిగా మార్చాలన్న అటల్‌జీ ఆశయానికి సాక్షీభూతమైన ప్రదేశం పోఖ్రాన్‌. మొదటగా ఉపయోగించబోం అన్న విధానానికి భారత్‌ ఇప్పటివరకు కట్టుబడి ఉంది. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’ పేర్కొన్నారు. యుద్ధానికి తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంటున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ ఆ దేశాన్ని ఉద్దేశించి పరోక్షంగా హెచ్చరించినట్లు భావిస్తున్నారు.

Updated : 16 Aug 2019 5:57 AM GMT
Tags:    
Next Story
Share it
Top