India's Twitter alternative Koo app launched in Brazil, becomes country's top app within 48 hours
mictv telugu

మస్క్ దెబ్బతో ట్విట్టర్‌ను వీడి ‘కూ యాప్’ వైపు పరుగులు

November 23, 2022

ట్విట్టర్ సీఈవోగా ఎలాన్ మస్క్ బాధ్యతలు చేపట్టిన నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగుల తొలగింపుతో పాటు బ్లూ టిక్‌ కోసం నగదు వసూలు చేయడం వంటి వాటితో యూజర్లను తికమక పెట్టేస్తున్నాడు. దీంతో యూజర్లు ట్విట్టర్‌ను వదిలి ప్రత్యామ్నాయ యాప్‌లపై దృష్టిసారిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మల్టీ లాంగ్వేజ్ మైక్రోబ్లాగింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ ’కూ‘(koo) యాప్’కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతోంది.తాజాగా బ్రెజిల్‌లో కూ యాప్ రికార్డు సృష్టించింది. రెండ్రోజుల క్రితం ఈ యాప్‌ను బ్రెజిల్‌‌లో విడుదల చేయగా ఒక మిలియన్స్ డౌన్ లోడ్ అయినట్టు కూ యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం 11 భాషల్లో అందుబాటులో ఉన్న కూ యాప్ మరిన్ని దేశాల్లో అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా కూ యాప్‌కు 50 మిలియన్‌ డౌన్‌లోడ్స్‌ ఉన్నాయి. ఇటీవలే బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌కు ఎలాంటి ఫీజు వసూలు చేయమని Koo స్పష్టం చేసింది.

Koo కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. “ప్రపంచంలో కేవలం 20% మంది ఇంగ్లీష్ మాట్లాడతారు. ప్రపంచంలోని 80% మంది తమ దేశానికి చెందిన భాషను మాట్లాడుతున్నారు. చాలా గ్లోబల్ ప్రోడక్ట్‌లు వివిధ భాషలలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ప్రారంభించినప్పటి నుంచి ఒక్క బ్రెజిల్‌ యూజర్ల నుంచి Koo ఇటీవల 2 మిలియన్ పోస్ట్‌లు, 48 గంటల్లో 10 మిలియన్ లైకులను సంపాదించింది” అని పేర్కొన్నారు.

భారత్‌లో బెంగుళూరు కేంద్రంగా ఏర్పడిన Koo ప్రారంభంలో కన్నడ భాష సపోర్టుతో 2020లో లాంచ్ అయింది. ఆ తరువాత Koo యాప్ హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, అస్సామీ, మరాఠీ, బంగ్లా, గుజరాతీ, పంజాబీ, భాషల్లో అందుబాటులోకి వచ్చింది…. త్వరలో కూ అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, కొరియన్, జపనీస్, ఇతర భాషలతో సహా మరిన్ని విదేశీ స్థానిక భాషల్లో రావడంపై దృష్టిపెట్టింది.