కొత్త ఏడాదిలో మొదటి వన్డే సిరీస్‌కు భారత్-శ్రీలంక జట్లు సిద్ధమయ్యాయి. టీమిండియాతో జరుగుతున్న మొదటి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ ప్రారంభించ నుంది. ఇక రోహిత్ శర్మ ముందుగా చెప్పినట్లుగానే ఇషాన్ కిషాన్‌కు తుది జట్టులో అవకాశం లభించలేదు. రోహిత్‌తో పాటు శుభమన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. టీ 20ల హీరో సూర్యకుమార్ యాదవ్ పేరు కూడా తుది జట్టులో కనిపించలేదు. వన్డేలో స్థిరంగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ వైపే జట్టు యాజమాన్యం మొగ్గు చూపింది.ఈ మ్యాచ్‌లో శ్రీలకం తరఫున దిల్షాన్ మదుశంక వన్డేల్లో ఆరంగ్రేటం చేస్తున్నాడు.
టీ 20 సిరీస్ గెలిచిన భారత్ జట్టు వన్డేలో కూడా సత్తా చాటాలని భావిస్తోంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఈ సిరీస్ నుంచే రాణించాలి. టీ 20లకు దూరమైన రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్, షమీతో పాటు శ్రేయస్ అయ్యార్ బరిలోకి దిగారు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ సచిన్ రికార్డులపై కన్నేశాడు. స్వదేశంలో సచిన 20 సెంచరీలు సాధించగా విరాట్ 19 సెంచరీలతో ఉన్నాడు. ఈ సిరీస్ లో రెండు సెంచరీలు కొడితే మాత్రం సచిన్ ను విరాట్ దాటేస్తాడు.
భారత్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(wk), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
శ్రీలంక జట్టు : పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(wk), అవిష్క ఫెర్నాండో, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, దిల్షన్ మధుశంక