india,srilanka live score update
mictv telugu

రోహిత్, గిల్ దూకుడు..స్కోర్ బోర్డు పరుగులు..

January 10, 2023

india,srilanka live score update

టాస్ ఓడి బ్యాటింగ్‎కు వచ్చిన టీఇండియా ఇన్నింగ్స్‎ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుం భారత్ 8 ఓవర్లలో 63/0 స్కోరు చేసింది. రోహిత్ శర్మ (26 బంతుల్లో 38) , శుభమన్ గిల్(22 బంతుల్లో 25) పరుగలతో క్రీజ్‎లో ఉన్నారు. ఇద్దరు పోటీ పడి పరుగులు చేస్తుండడంతో స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది. మధుశంక వేసిన నాలుగో ఓవర్లో గిల్ వరుసుగా మూడు ఫోర్లు బాదాడు. అదే ఊపుతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఇక రోహిత్ శర్మ రజిత వేసిన ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టి మొత్తం 17 పరుగులు రాబాట్టాడు. మంచి బాల్స్‎ను గౌరవిస్తూనే చెత్త బంతులు పడితే మాత్రం బౌండరీ బాదేస్తున్నారు.

టీ 20 సిరీస్ గెలిచిన భారత్ జట్టు వన్డేలో కూడా సత్తా చాటాలని భావిస్తోంది. వన్డే వరల్డ్ కప్‌ 2023 టోర్నీ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఈ సిరీస్ నుంచే రాణించాలి. టీ 20లకు దూరమైన రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్, షమీతో పాటు శ్రేయస్ అయ్యార్ బరిలోకి దిగారు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ సచిన్ రికార్డులపై కన్నేశాడు. స్వదేశంలో సచిన 20 సెంచరీలు సాధించగా విరాట్ 19 సెంచరీలతో ఉన్నాడు. ఈ సిరీస్ లో రెండు సెంచరీలు కొడితే మాత్రం సచిన్ ను విరాట్ దాటేస్తాడు.