indiavs Australia, 2nd ODI - Live Score, five wickets down
mictv telugu

చెలరేగిన స్టార్క్….కష్టాల్లో భారత్..ఆశలన్నీ కోహ్లీ పైనే

March 19, 2023

indiavs Australia, 2nd ODI - Live Score, five wickets down

విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆసీస్ పేసర్ స్టార్క్ చెలరేగడంతో ఆరంభంలోనే 5 వికెట్లు కోల్పోయింది టీం ఇండియా. గిల్(0), రోహిత్ శర్మ (13), సూర్యకుమార్ యాదవ్(0), కేఎల్ రాహుల్(9) ను స్టార్క్ పెవిలియన్‌కు పంపించేశాడు. అనంతరం హార్దిక్ పాండ్యా(1) కూడా వచ్చిన వెంటనే అబాట్ బౌలింగ్‌లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు. మొదటి వన్డేలో మొదటి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన సూర్య మళ్లీ సేమ్ రిపీట్ చేశాడు. అదే స్టార్క్ బౌలింగ్ లో మరోసారి మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.ప్రస్తుతం భారత్ 11 ఓవర్లలో 54 పరుగులు చేసింది. కోహ్లీ(23), జడేజా (4)క్రీజ్‎లో ఉన్నారు.

టాస్ గెలిచి మొదట ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగింది. మొదటి వన్డేకు దూరమైన రోహిత్ తో పాటు అక్షర్ పటేల్ క్రీజ్ లోకి రాగా ఇషాన్ కిషన్, శార్థూల్ ఠాకూర్‌లు బెంచ్‎కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియాలో జట్టులో కూడా మార్పులు కనిపించాయి. మ్యాక్స్ వెల్, ఇంగ్లీష్ స్థానంలో అలెక్స్ క్యారీ, ఎల్లీస్ జట్టులోకి వచ్చారు.