ఇండిగో విమానం.. ఎక్కడికైనా రూ.899కే… - MicTv.in - Telugu News
mictv telugu

ఇండిగో విమానం.. ఎక్కడికైనా రూ.899కే…

October 24, 2018

దీపావళి పండుగ వస్తే చాలు ఏ షాపుకెళ్లినా అఫర్లపై అఫర్లు ఉంటాయి.. బట్టలు, బంగారు, బైకులు, కార్లు.. చాలా వాటికి మంచి ఆఫర్లు పెట్టి విక్రయిస్తుంటారు. కానీ ఈ ఏడాది దీపావళికి ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీపావళి స్పెషల్ సేల్ పేరుతో  అత్యంత తక్కువ ధర రూ.899కే విమాన టికెట్లను అందిస్తోంది. అక్టోబర్ 24 నుంచి 26 వరకు ఈ ఆఫర్ కొనసాగుతుంది. మొత్తం 10లక్షల సీట్లను కేటాయించామని ఇండిగో సంస్థ ప్రకటించింది. ఈ మూడు రోజుల్లో టిక్కెట్లు కొనుగోలు చేసిన వారు నవంబర్ 8, 2018, ఏప్రిల్ 15, 2019 వరకు ఈ ఆఫర్ కింద ప్రయాణం చేయొచ్చని ఇండిగో పేర్కొంది.

Indigo Special Offer To Passengers For Diwali Festival

ఇండిగో చీఫ్ కమర్షియల్ అధికారి మాట్లాడుతూ.. ‘64 గమ్యస్థానాలకు ఈ ఆఫర్ వర్తిస్తోంది. కుటుంబ సభ్యులను, స్నేహితులను కలుసుకుని వారితో దీపావళి పండుగను జరుపుకోవచ్చు. ఫెస్టివల్ సందర్భంగా మా ప్రయాణికులను తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు ఆఫర్ను తీసుకొచ్చాం. ఎయిర్ పోర్టు ఛార్జీలు, ప్రభుత్వ పన్నుల మీద ఎటువంటి రాయితీ ఉండవు. దేశీయ, విదేశీయ మార్గాల్లో ప్రయాణించే నాన్ స్టాప్ విమానాలకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. ఆఫర్ కింద కొనుగోలు చేసిన టికెట్లు రద్దు చేసుకుంటే నగదు తిరిగి ఇవ్వరు. ఇండిగో వెబ్సైట్ ద్వారా టికెట్ల బుకింగ్ చేసుకోవచ్చు. దీపావళి సమయంలో టికెట్ల అమ్మకాలు తప్పకుండా విమానయాన సంస్థల మధ్య ఉన్న పోటీపై ప్రభావం చూపుతాయి’ అని పేర్కొన్నారు.