ఇండిగో బంపర్ ఆఫర్లు.. 999కే దేశీ, 3499కే విదేశీ - MicTv.in - Telugu News
mictv telugu

ఇండిగో బంపర్ ఆఫర్లు.. 999కే దేశీ, 3499కే విదేశీ

May 15, 2019

ఇండిగో విమానయాన సంస్థ వేసవి సీజన్ సందర్భంగా బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఏకంగా పది లక్షల సీట్లను చవక ధరలకు అందిస్తున్నట్టు ప్రకటించింది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు 53 దేశీయ రూట్లు, 17 అంతర్జాతీయ రూట్లలో టికెట్ల అమ్మకం ప్రారంభైంది. ఈ నెల 16లోపు బుక్ చేసుకోవాలి. దేశీ సర్వీసుల రూట్లలో రూ. 999 ప్రారంభ ధరతో ఈ టిక్కెట్లు అమ్ముతున్నారు. ఇందులో ముంబై-హైదరాబాద్‌ వంటివి ఉన్నాయి.

రూ. 3,499 ప్రారంభ ధరలో విదేశీ సర్వీసు టికెట్లు ఉన్నాయి. ఆ ఆఫర్‌ కింద టిక్కెట్లు బుక్‌ చేసుకున్నవాళ్లు ఈ నెల 29 నుంచి సెప్టెంబరు 28 లోపు ప్రయాణించాల్సి ఉంటుంది. డిజిబ్యాంక్ డెబిట్ కార్డు ద్వారా బుక్ చేసుకుంటే రూ. 750 వరకు, మోబిక్విక్ ద్వారా చేసుకుంటే రూ. 1000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తున్నారు.