కొత్త సంవత్సరంలో విమానం ప్రయాణం చేయాలనుకునే వారికి శుభవార్త. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తమ ప్రయాణికులకు కోసం భారీ ఆఫర్ను ప్రకటించింది. డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 25 వరకు తగ్గింపు ధరలకే టికెట్లను అందించనుంది. 2023 జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 మధ్య ప్రయాణానికి ఈ ఆఫర్ టికెట్లు లభించనున్నాయి. దేశీయ ప్రయాణానికి రూ.2,023, అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.4999కే టికెట్ ధరలు అందుబాటులో ఉండనున్నాయి. దీంతో పాటు HSBC కస్టమర్స్ కి అదనంగా క్యాష్ బ్యాక్ పొందొచ్చని ఇండిగో ప్రకటించింది.
అయితే టికెట్లు అందుబాటులో ఉన్నంతవరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. ఇండిగోకు మొత్తం 290 విమానాలు ఉండగా..రోజుకు 1600 విమాన సర్వీసులను నడుపుతోంది. ఇందులో 76 దేశీయ, 26 అంతర్జాతీయ సర్వీసులు ఉన్నాయి.