Indo Tibetan Border Police Constable Recruitment
mictv telugu

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‎మెంట్…!!

February 5, 2023

Indo Tibetan Border Police Constable Recruitment

ఐటీబీపీ రిక్రూట్ మెంట్ 2023లో భాగంగా…71 కానిస్టేబుల్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 20,2023న ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ మార్చి 21, 2023. పోస్టులు, వయోపరిమితి, అర్హత ప్రమాణాల గురించి తెలుసుకుందాం.

ఉపాధి విభాగం : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్

ఖాళీల వివరాలు : కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు
సంఖ్య : 71
అర్హత : పదవ తరగతి.
జీత భత్యం : రూ.21,700-69100 (లెవల్ 3 పే మ్యాట్రిక్స్ పే 7వ పే కమిషన్ ప్రకారం )
వయస్సు: కనిష్టంగా 18ఏళ్లు, గరిష్టంగా 25ఏళ్లు మించకూడదు. దరఖాస్తు చేయడానికి తరగతుల వారీగా వయో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 20-02-2023
దరఖాస్తుకు చివరి తేదీ, ఫీజు చెల్లింపు: 21-03-2023 రాత్రి 11-59 వరకు.
దరఖాస్తు రుసుము: రూ.100.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ వెబ్ సైట్ https://recruitment.itbpolice.nic.in/ను చెక్ చేసుకోండి.

పరీక్ష విధానం :

ITBP కానిస్టేబుల్ GD అభ్యర్థుల ఫిజికల్ ఎఫిషియెన్సీ (PST), ఫిజికల్ క్వాలిటీ టెస్ట్, వ్రాత పరీక్ష, నైపుణ్యం పరీక్ష, డాక్యుమెంటేషన్, వివరణాత్మక వైద్య పరీక్షలు ఉంటాయి.