Indonesia finds medicines with ingredients linked to fatal child kidney injury
mictv telugu

సిరప్‌లు సేఫ్ కాదా..? ఆ 99 మంది చిన్నారుల మృతికి అవే కారణమా?

October 20, 2022

సిరప్‌లు దడ పుట్టిస్తున్నాయి. వాటిని ముట్టుకోవాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు.చిన్నపిల్లలకు దగ్గు, జలబు చేస్తే ఠక్కున సిరప్ వేసే వారు..ఇప్పుడు ఏదేశంలో ఏం జరిగినా ఉలిక్కిపడుతున్నారు. మొన్న గాంబియాలో ఇప్పుడు ఇండోనేషియాలో 99 మంది చిన్నారులు చనిపోయారు. ఈ ఘటనతో సిరప్‌లను ఇండోనేషియా బ్యాన్ చేసింది. మనదేశంలో సిరప్ లు సురక్షితమని కేంద్ర ప్రభుత్వం చెప్పినా తల్లీదండ్రుల్లో ఆందోళన పోవడం లేదు.

మొన్న గాంబియా..ఇవాళ ఇండోనేషియా

డేంజర్ సిరప్‌లు పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. ఇండోనేషియాలో 99 మంది చిన్నారులు చనిపోయారు. దీంతో అన్ని రకాల సిరప్‌లు, ద్రవరూప మందులను ఇండోనేషియా బ్యాన్ చేసింది. మూడువారాల క్రితం గాంబియాలో సిరప్‌లు తాగి సుమారు 70 మంది చిన్నారులు ప్రాణాలొదిలారు. ఈ ఘటన జరిగిన కొన్ని వారాల్లోనే ఇండోనేషియాలో 99 మంది చిన్నారులు చనిపోవడం కలకలం రేపుతోంది. కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీసే రసాయనాలు సిరప్‌ల్లో ఉన్నట్లు ఇండోనేషియా తెలిపింది. వీటితోనే ఈ ఏడాది 99 మంది చనిపోయారని భావిస్తోంది. 200 మంది చిన్నారుల్లో కిడ్నీ సమస్యలను గుర్తించినట్లు ఇండోనేషియా ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. అయిదేళ్ల లోపు పిల్లల్లో ఈ సమస్య అధికంగా ఉందన్నారు.

Indonesia finds medicines with ingredients linked to fatal child kidney injury

సిరప్‌లలో ప్రమాదకర రసాయనాలు

దగ్గు సిరప్‌లను వాడవద్దొని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని వారాల క్రితం ప్రపంచ దేశాల్ని హెచ్చరించింది.
గాంబియాలో 70 మంది చిన్నారులు మృతిచెందిన తర్వాత ఈ హెచ్చరిక చేసింది. ఈ ఘటనకు ఇండియాలో తయారైన సిరప్‌ లే కారణమని తెలిపింది. దగ్గు సిరప్‌లలో డైఇథలీన్‌ గ్లైకాల్‌, ఇథలీన్‌ గ్లైకాల్‌లు అధిక మోతాదుల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ రసాయనాల వల్ల కిడ్నీలు దెబ్బతింటున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత్ లో సిరప్‌లు సేఫే…

ఈ సిరప్‌ల్ని భారత్ లో అమ్మలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశాలకు ఎగుమతి చేసేందుకే వీటిని తయారు చేశారని క్లారిటీ ఇచ్చింది. అయినా నిపుణలతో ఓ కమిటీని వేసింది. తల్లీదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.