సునామీకి కొన్ని క్షణాల ముందు.. వైరల్ వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

సునామీకి కొన్ని క్షణాల ముందు.. వైరల్ వీడియో

October 5, 2018

ఇండోనేసియాను కుదిపేసిన భూకంపం, సునామీ నష్టం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. సులవేసి ద్వీప రాజధాని పాలూ నగరంలో ప్రకృతి సృష్టించిన విలయ దృశ్యాలు ఇంకా చెరిగిపోలేదు. ఎటూ చూసినా శిథిలాలు, మృతదేహాలు కనిపిస్తున్నాయి. సహాయక చర్యలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. సునామీ దెబ్బకు ఇప్పవరకు లక్షన్నమందికిపైగా నిరాశ్రయులయ్యారని, 70 వేల ఇళ్లు ధ్వంసయ్యాయని, మృతుల సంఖ్య 1,571కి చేరిందని అధికారులు తెలిపారు.

సునామీ విరుచుకుపడుతున్నడు తీసిన వీడియలో వైరలైన సంగతి తెలిసిందే. వాటికంటే దిగ్బ్రాంతి కలిగించే వీడియో ఒక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాలూలో రోడ్డు ఉన్న ప్రాంతంలో ఇంకొన్ని క్షణాల్లో  సునామీ కబళిస్తుందనగా రికార్డయిన వీడియో ఇది. రోడ్డుపై జలరక్కసి వస్తుండడం, వాహనాలు వెంటనే మలుపు తిప్పుకుని పోవడం,  చూస్తుండగానే నీటిలో ఇళ్లు, చెట్లు కొట్టుకురావడం కనిపిస్తున్నియ. అంతవరకు ప్రశాంతగా ఉన్న ప్రాంతం క్షణాల్లోనే విలయానికి బలైపోయింది.