రామాయణానికి ఇండోనేసియా ఫిదా.. స్టాంపు విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

రామాయణానికి ఇండోనేసియా ఫిదా.. స్టాంపు విడుదల

April 24, 2019

భారత ప్రాచీన ఇతిహాసం రామాయణానికి ఇండోనేసియాలో అరుదైన గౌరవం దక్కింది. ఆ దేశం తొలిసారి రామాయాణంపై స్టాంపును విడుదల చేసింది. భారత్, ఇండోనేషియా సాంస్కృతిక సంబంధాలకు ప్రతికగా మంగళవారం దీన్ని విడుదల చేశారు.

Indonesia releases Ramayana stamp for 1st time celebrating centuries old cultural bonds.

భారత్‌తో దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పోస్టల్ శాఖ దీన్ని ఆవిష్కరించింది. ప్రముఖ ఇండోనేసియా శిల్పి పద్మశ్రీ బాపక్ న్యోమాన్ నార్తా దీన్ని తయారు చేశారు. సీతను అపరిహరిస్తున్న రావణుడిపై జటాయువు భీకరంగా పోరాడుతున్న దృశ్యం అందులో ఉంది. అయితే స్టాంపు కవర్లను పరిమితంగానే విక్రయిస్తున్నారు. భారత, ఇండోనేసియాల మధ్య శతాబ్దాలుగా సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. హిందూ, బౌద్ధమతాలు భారత్ నుంచి అక్కడికి వ్యాపించాయి. భారత శిల్పచిత్రకళలు, నాట్యసంగీతాలు కూడా ఆ దేశంపై బలమైన ప్రభావం వేశాయి.