బడిపిల్లలకు కోడిపిల్లలు.. ఫోన్ కాటుకు భలే దెబ్బ - MicTv.in - Telugu News
mictv telugu

బడిపిల్లలకు కోడిపిల్లలు.. ఫోన్ కాటుకు భలే దెబ్బ

November 25, 2019

మొబైల్ ఫోన్‌కు పెద్దలే కాకుండా బొడ్డూడని పసిపిల్లలు కూడా బానిసలుగా మారిపోతున్నారు. పొద్దస్తమానం దాంట్లో ముఖాలు పెడుతూ లోకాన్ని మరచిపోతున్నారు. చేతుల్లోంచి ఫోన్ గుంజుకుంటే చాలు భూనభోంతళాలు పగిలిపోయేలా ఏడుస్తుంటారు. బాల్యంలోనే ఇలా తయారైతే సరైనా మానసిక, శారీరక ఎదుగుదల ఉండదని వైద్యులు హెచ్చరిస్తున్నా. ఈ జాడ్యాన్ని వదిలించడానికి ఇండోనేసియాలోని బండాంగ్ నగర అధికారులు కొత్త పరిష్కారం కనిపెట్టారు. 

బడి పిల్లల దృష్టిని ఫోన్లపై నుంచి పక్కకు మళ్లించడానికి వారికిష్టమైన కోడిపిల్లలను ఉచితంగా పంచుకుతున్నారు. వాటితోపాటు మిరప విత్తనాలను అందజేస్తున్నారు. కోడిపిల్లలను సంరక్షించి, మిరప చెట్లను పెంచే బాధ్యతను వారికి అంటగట్టారన్నమాట. కోడిపిల్లలకు తిండిపెడుతూ  వాటితో గడపడం వల్ల పిల్లలు ఉత్సాహంగా ఉంటారని అధికారులు చెప్పారు. ‘దీన్ని బాగా పెంచి, పెద్దయ్యాక కోసుకుని తింటాం..’ అని ఓ గడుగ్గాయి చెప్పడం ఇందులో మరో కోణం! ఇండోనేసియా పౌరులు సగటున్న రోజుకు 8 గంటల 36 నిమిషాల పాటు ఇంటర్నెట్‌పై గడుపుతున్నారు. ఇది ప్రపంచ సగటుకంటే రెండు గంటలు ఎక్కువ.