Indonesian woman finds out 10 months after marriage that her husband is a woman
mictv telugu

ప్రేమించి, పెళ్లి చేసుకుంది.. పది నెలల తర్వాత మేటర్ తెలిసి షాక్

June 20, 2022

 

Indonesian woman finds out 10 months after marriage that her husband is a woman

డేటింగ్ యాప్ ద్వారా కలిగిన వారిద్దరి పరిచయం .. తర్వాత ప్రేమగా మారింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లయిన దాదాపు పది నెలల తర్వాత ఆమెకు ఊహించని షాక్ తగిలింది. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఒక అబ్బాయి కాదని.. అమ్మాయి అని తెలిసి కోర్టును ఆశ్రయించింది.

ఇండోనేషియాకి చెందిన ఓ మహిళకు డేటింగ్ యాప్ లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అతను ఓ సర్జన్ అని, వ్యాపారాలు కూడా ఉన్నాయని చెప్పాడు. దీంతో.. ఆ యువతి ఇంట్లో చెప్పకుండా అతడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత యువతి.. తన కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం గమనార్హం.

అయితే.. పెళ్లి తర్వాత కట్నం కోసం సదరు వరుడు.. ఆ యువతిని, ఆమె కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తన కుటుంబం నుంచి దాదాపు రూ.15లక్షల ను తన భర్త కుటుంబానికి ఇచ్చింది. ఈ క్రమంలోనే తన భర్త పురుషుడు కాదన్న దిగ్భ్రాంతికర విషయం వెల్లడైంది. దాంతో ఆమె తన కుటుంబం వద్దకు వెళ్లిపోయింది. కుటుంబ సభ్యుల సలహాతో జాంబి జిల్లా కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. వీరి పెళ్లి కి సంబంధించి చట్టమైన పత్రాలు ఏమీ లేకపోవడం గమనార్హం. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.