ఏమీ చెయ్యకుండా 70 వేలు సంపాదించాడు..  - MicTv.in - Telugu News
mictv telugu

ఏమీ చెయ్యకుండా 70 వేలు సంపాదించాడు.. 

August 1, 2020

Indonesian youtuber posts 2-hour long video of himself

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడానికి అందరూ ఎదో ఒక పనిచేస్తారు. కొందరు వంటల వీడియోలు అప్ లోడ్ చేస్తారు. మరికొందరు షార్ట్ ఫిలిమ్స్ తీస్తారు. కొందరు ఏదైనా విషయం గురించి మాట్లాడిన వీడియోలను అప్ లోడ్ చేస్తారు. వాటికీ వచ్చిన వ్యూస్ ద్వారా సంపాదిస్తారు. ఇందు కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కానీ, ఇండోనేషియాకు చెందిన మహమ్మద్ దిదిత్ అనే యూట్యూబర్ మాత్రం ఏమి చేయకుండా వైరల్ అయ్యాడు.

 ఆ యువకుడు రెండు గంటల పాటు కెమెరాను చూస్తూ కూర్చుండిపోయాడు. తరువాత వీడియోను తన యూట్యూబ్ ఛానల్ అప్ లోడ్ చేశాడు. అది కాస్త వైరల్ అయింది. ఆ వీడియోను ఇప్పటివరకు 19 లక్షల మందికి పైగా చూశారు. దీంతో ఆ యువకుడికి రూ. 70 వేల ఆదాయం వచ్చింది. ఏమి చేయకుండా, కదలకుండా కూర్చొని రూ.70 వేలు సంపాదించడం అంటే మాములు విషయం కాదని నెటిజన్లు అంటున్నారు. ఏమి చేయకుండా ఉన్న వీడియో వైరల్ కావడం ఆశ్చర్యంగా ఉందని మహమ్మద్ దిదిత్ వీడియో ట్రెండ్ అయ్యిందని తెలిపాడు.