మనం ఫుడ్ కోసం కేఫ్ ల చుట్టూ తిరుగుతుంటాం. మరి మన పెంపుడు జంతువుల పరిస్థితి ఏంటి? అందుకే కుక్కల కోసం ఇండోర్ లో ఒక దాబా ఏర్పాటు చేశారు.
పెంపుడు జంతువు ఆరోగ్యం, ఆనందాన్న జాగ్రత్తగా చూసుకోవడం దాని యజమానుల పెద్ద బాధ్యత. పెంపుడు జంతువులను అనుమతించే కేఫ్ లు చాలా తక్కువ. అలాంటిది వాటికోసమే ఒక జంట కేఫ్ ను ఏర్పాటు చేసింది. కుక్కల కోసం పోషక విలువలున్న ఆహారం పెట్టడమే లక్ష్యంగా ఈ కేఫ్ నడిపిస్తున్నారు.
కుక్కల కు మాత్రమే..
కోవిడ్ సమయంలో కుక్కలకు ఫుడ్ పెట్టేందుకు చాలామంది పూనుకున్నారు. అలా బాల్ రాజ్ ఝాలా ఒకడు. అతను ఒక రెస్టారెంట్ లో వర్కర్ గా పనిచేసేవాడు. అక్కడ మిగిలిన వాటిని వచ్చేటప్పుడు వీధిలో ఉన్న కుక్కలకు పెట్టేవాడు. అలా కుక్కల మీద మక్కువ ఏర్పడింది. అంతేకాదు.. తను కూడా జంతు ప్రేమికుడు. అందుకే ఈ దాబా ఓపెన్ చేశాడు. ఇందులో కుక్కలు భోజనం చేయడానికి, ఆడుకోవడానికి, ఉండడానికి కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
స్పెషాలిటీస్..
దాబాలో వెజ్, నాన్ వెజ్ స్పెషాలిటీలు ఉన్నాయి. ఇందులో సప్లిమెంట్స్ తో సహా రోజుకు రూ. 7 నుంచి రూ. 500 వరకు వివిధ రకాల డాగ్ ఫుడ్స్ ను అందిస్తుంది. అదనంగా డాగీ దాబా కుక్కల పుట్టిన రోజుల కోసం కూడా కేక్ లను తయారుచేస్తున్నది. తద్వారా వారు తమ ప్రత్యేక రోజును ఘనంగా జరుపుతారు. అంతేకాదు.. ఆన్ లైన్ డెలివరీ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అయితే వారంలో రెండు రోజుల్లో మాత్రం ఈ డెలివరీ సర్వీసులు ఉంటాయి. ఈ దాబాలో కుక్కల సంక్షేమం కూడా ఏర్పాట్లు చేశారు. దీనివల్ల దీని యజమానులు వాటిని వదిలేసి బయటకు వెళ్లినప్పుడు ఈ జంట వాటిని చూసుకుంటుంది.