Indore domino pizza delivery girl Madhya Pradesh
mictv telugu

అమ్మాయిలు కాదు రాక్షసులు.. ఫ్రెండుపై ఘోరం వీడియో

June 14, 2022

దుర్మార్గాల్లో కొందరు ఆడవాళ్లు కరుడుగట్టిర మగవాళ్లకేమీ తీసిపోరని ఈ ఉదంతం నిరూపిస్తోంది. ఓ చిన్నమాటపై గొడవ రేగంతో నలుగురు అమ్మాయిలు తమ స్నేహితురాలిపై రక్కసుల్లా దాడి చేశాయి. నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని, ఈడ్చి, పిడిగుద్దులు గుద్దారు. చుట్టూ ఉన్నవాళ్లు వినోదంలా చూశారే తప్ప దాడిని అడ్డుకోలేదు. పిజ్జా డెలివరీ గర్ల్‌గా పనిచేస్తున్న బాధితురాలి ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శనివారం ఈ దారుణం జరిగింది. నందినీ యాదవ్ అనే యువతి డోమినో కంపెనీలో పిజ్జా డెలివరీ గర్ల్‌గా పనిచేస్తోంది. ఆమె పనిపై వెళ్తుంగా పింకీ అనే యువతి, మరో ముగ్గురు ఏదో అన్నారు. నందిని కూడా వాళ్లను ఘాటుగా బదులిచ్చింది. గొడవ పెరిగింది. పికీ అండ్ కో కర్రలు తీసుకుని నందినిపై దాడి చేశారు. కిందపడేసి కొట్టారు. నందిని తనను కాపాడుకోడానికి ఓ ఇంట్లోకి వెళ్లింది. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.