Indore young girls issue with a woman
mictv telugu

మందుకొట్టి ఓ అమ్మాయిని ఘోరంగా కొట్టిన యంగ్ గాళ్స్..

November 7, 2022

Indore young girls issue with a woman

ఆడవాళ్లు పద్ధతిగా ఉన్నాలన్న మాటకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఆడవాళ్లు అందరితో సమానంగా ఉండాలి. ఇదే నేటి న్యాయం, సూత్రం. కానీ కొందరు ఆడవాళ్లు దీన్ని మరో రకంగా అర్థం చేసుకుంటున్నారు. ‘ఏం ఆ ఘోరాలు, నేరాలు మగవాళ్లు మాత్రమే చేయాలా? మేం చేస్తే తప్పేంటి? మందుకొట్టి రోడ్డెక్కి వాయించుకుంటే నేరమేంటి? మా డబ్బు, మా మందు, మా ఇష్టం, మా కాళ్లు, మా చేతులు, కొట్టుకుంటాం, చస్తాం, చంపుతాం, అరెస్టవుతాం, జైళ్లలో పడతాం. ఇంటి పరువు తీస్తాం’ అంటున్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో అలాంటిదే జరిగింది. నలుగురు అమ్మాయిల ముఠాకు ఓ అమ్మాయికి మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. పూటుగా మందుకొట్టిన లేడీ రౌడీస్ అర్ధరాత్రి తగ్గదేలే అంటూ నడిరోడ్డుపై ఇష్టమొచ్చినట్లు ఆ అమ్మాయిని కొట్టారు. చుట్టూ ఉన్న జనం ఉచిత వినోదంగా వీడియో తీస్తూ ఎంజాయ్ చేశారే తప్ప, ‘తప్పమ్మా అలా కొట్టొద్దు. ఇంటికెళ్లి మజ్జిగ పుచ్చుకుని నిద్రపోండి’ అని చెప్పిన పాపాన పోలేదు. ఎల్ఐడీ జంక్షన్ వద్ద ఈ ఘోరం జరిగింది. బెల్టు వాయించడం, జుట్టుపట్టి కొట్టడం, కాళ్లతో రొమ్ములపై గుద్దడం వంటి ఎన్నెన్నో కళలు ప్రదర్శించారు వీర వనితలు. బాధితురాలు ఎరువులు షాపులో పనిచేస్తోందని, నిందితులపై చర్యలు తీసుకుంటామన పోలీసులు చెప్పారు.
Indore young girls issue with a woman
Indore, young girls issue, a woman, Madhya Pradesh, drunken woman