ఇంద్రకీలాద్రి.. హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం - MicTv.in - Telugu News
mictv telugu

ఇంద్రకీలాద్రి.. హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం

May 10, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద దేవాలయంగా పిలువబడే ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో కొంతమంది సిబ్బంది హుండీల లెక్కింపు విషయంలో చేతివాటం ప్రదర్శించారు. బంగారు ఆభరణాలను అపహరించేందుకు ప్రయత్నించారు. ఆలయ అధికారులు గమనించి ఎస్పీఎఫ్ అధికారులకు సమాచారం అందించారు.

”ఎస్పీఎఫ్ తనిఖీల్లో నల్లపూసల చైన్, ఒక ఉంగరం, రెండు గిల్లు ఉంగరాలు, బుట్ట దుద్దులు బయటపడ్డాయి. మహా మండపం వద్ద ఉన్న వాష్‌ రూంలో బంగారం గుర్తించాం. బంగారం విలువ సుమారు 5 గ్రాములు ఉంటుంది. వీటి విలువ రూ.16 వేలు ఉంటుంది” అని పోలీసులు తెలిపారు.

అర్చకులు మాట్లాడుతూ..’దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీలను సోమవారం సిబ్బంది లెక్కించారు. 41 హుండీల్లో 19 రోజుల్లో వచ్చిన కానుకలను లెక్కించగా, మొత్తం రూ.2.64 కోట్ల ఆదాయం వచ్చింది. పది గంటలపాటు దేవస్థానం సిబ్బందితోపాటు సేవా సంస్థల సభ్యులు కానుకలను లెక్కించారు. 586 గ్రాముల బంగారం, 6.060కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు” అని అన్నారు.