ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ ఇండియన్ వినియోగదారల కోసం బడ్జెట్ ఫోన్లను ప్రవేశపెట్టనుంది. ఇటీవల 5జీ నెట్ వర్క్ రావడంతో 5జీ ఫోన్లకు డిమాండ్ పెరుగుతుందనే అంచనాతో మార్కెట్ లో తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలని యోచిస్తోంది. అందులో భాగంగా కేవలం రూ. 11,999లకే అత్యాధునిక 5జీ ఫోన్ ని అందుబాటులోకి తెస్తుంది. డిసెంబర్ 9న రిలీజయ్యే ఈ ఫోన్ భారతీయ కస్టమర్లను ఆకట్టుకునే ఫీచర్లను జోడించింది.
ఇన్ఫినిక్స్ hot 20 5g మోడల్ గా నామకరణం చేసిన ఈ పోన్ లో 50 ఎంపీ డ్యుయల్ కెమెరా, సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరాను అమర్చింది. 5000 మెగాహెడ్జ్ బ్యాటరీ సామర్ద్యంతో 18 వాట్ల ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఇంకా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్, ఫేస్ అనలాక్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, డ్యుయల్ సిమ్, 3.5 మిమీ ఆడియో జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్లాస్టర్ గ్రీన్, రేసింగ్ బ్లాక్, స్పేస్ బ్లూ కలర్లలో వస్తున్న ఈ ఫోన్ 4జీబీ – 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధరను పైన చెప్పినట్టు రూ. 11,999లకే అందిస్తోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న poco pro 5g, lava blaze 5gలకు పోటీగా వస్తున్నట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఇటీవల ఈ సంస్థ కేవలం 12 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ అయ్యే 180 వాట్ల ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన Infinix Zero Ultra ఫోన్ తో ఫ్లాగ్ షిప్ విభాగంలోకి ప్రవేశించింది. 200 ఎంపీ కెమెరా ఉండడం ఈ ఫోన్ ప్రత్యేకత. అంతర్జాతీయ మార్కెట్లో రిలీజైన ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 5జీ ప్రాసెసర్ అమర్చారు.