అతి తక్కువ ధరకే మంచి ఆఫర్స్‌తో సరికొత్త మొబైల్‌ను ఇన్ఫీనిక్స్ విడుదల చేసింది. లాంఛింగ్ ఆఫర్‌తో కేవలం 10 వేలు లోపు ధరకే 8జీబీ + 128జీబీ స్టోరీజ్ కలిగిన ఇన్ఫినిక్స్ హాట్ 30పేరుతో ఫోన్‌ను అందిస్తోంది. ఏప్రిల్ నుంచి భారత్‌తో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. మొదటి వారం రోజులు ఫ్లిఫ్ కార్ట్‌లో మాత్రమే అందబాటులో ఉంటాయి. ఈ ఇన్ఫీనిక్స్ ఫోన్ ఫీచర్స్, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫీచర్స్..
*లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే
* 50 ఎంపీ డ్యుయల్ కెమెరా
* 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
* 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
* ఒక్కసారి ఛార్జ్ చేస్తే స్టాండ్‌బై మోడ్‌లో 30 రోజుల వరకు వర్క్
* ఆక్టాకోర్ మీడియా టెక్ జీ37 ప్రాసెసర్
* మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజీని పెంచే అవకాశం
* 4జీ ఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, బ్లూటూత్, ఓటీజీ, వైఫై సౌలభ్యం
*ఫేస్ అన్‌లాకింగ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్
ధర ఎంతంటే..
ఇన్ఫీనిక్స్ హాట్ 30ఐ ఫోన్‌లో 8జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ర్యామ్‌ను వర్చువల్‌గా 16 జీబీ వరకు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇది రూ.8,999 కి వెలకమ్ ఆఫర్ కింద లభిస్తోంది. భవిష్యత్తులో ఈ ధర పెరగొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్‌బ్యాక్ తో పాటు రూ.317తో ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్ ఉంది.