ఈనెల 29న భారత మార్కెట్లోకి ‘ఇన్ఫినిక్స్ హాట్ 9’ ఫోన్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఈనెల 29న భారత మార్కెట్లోకి ‘ఇన్ఫినిక్స్ హాట్ 9’ ఫోన్లు

May 23, 2020

Infinix

గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ ఫోన్లు ఈ నెల 29న భారత్‌లో విడుదల కానున్నాయి. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈనెల 20న ఈ ఫోన్ల విడుదలపై ఇన్ఫినిక్స్ సోషల్ మీడియాలో టీజ్ చేసింది. అయితే ఈరోజు ఈ ఫోన్లకు సంబంధించి ఫ్లిప్‌కార్ట్ మరిన్ని విషయాలు వెల్లడించింది. ఈ నెల 29న మధ్యాహ్నం 12 గంటలకు ఇన్ఫినిక్స్ హాట్ 9 సిరీస్ ఫోన్లు.. ఇన్ఫినిక్స్ హాట్ 9, ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రొ ఫోన్లు విడుదల కానున్నాయని ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో ఇండోనేషియాలో విడుదల చేసిన ఫోన్‌కు ఇన్ఫినిక్స్ హాట్ 9 సేమ్ మోడల్ కాగా, 9ప్రొ దీనికి అప్‌గ్రేడెడ్ వెర్షన్. ఈ ఫోన్ కోసం యూజర్లు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

 

ఇన్ఫినిక్స్ హాట్ 9 ఫీచర్లు ఇలా…

 

-6.6 అంగుళాల ఐపీఎస్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే

-ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో ఎ25 ప్రాసెసర్

-4జీబీ ర్యామ్

-5,000 ఎంఏహెచ్ బ్యాటరీ

-8 ఎంపీ సెల్ఫీ కెమెరా

-వెనకవైపు 48 ఎంసీ ప్రధాన సెన్సార్‌తో క్వాడ్ కెమెరా

వంటి ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్ సొంతం.