Infinix Note 12i with AMOLED display, 50MP camera launched in India at Rs 9,999 
mictv telugu

అమోల్డ్ డిస్ ప్లేతో.. 50మెగా పిక్సెల్ కెమెరాతో 10వేల రూపాయల్లో ఫోన్ వచ్చేస్తున్నది!

January 26, 2023

Infinix Note 12i with AMOLED display, 50MP camera launched in India at Rs 9,999 

చైనా మ్యానుఫ్యాక్చరర్ అయిన ఇన్ ఫినిక్స్ భారతదేశంలో తన స్మార్ట్ ఫోన్ పరిధిని విస్తరించాలనుకుంటున్నది. సరికొత్త బడ్జెట్ కేటగిరీలో ఒక ఫోన్ తీసుకువచ్చింది.
మీడియా టెక్ హీలియో జీ85 ప్రాసెసర్ తో ఈ ఫోన్ వస్తుంది. ఇది సరైన గేమింగ్ పని తీరు కోసం 10 లేయర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇన్ ఫినిక్స్ నోట్ 12ఐ స్మార్ట్ ఫోన్ జనవరి 30 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా దేశంలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. పరిచయ ఆఫర్లలో జియో వినియోగదారులకు వెయ్యి రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా ఉంది.

స్పెసిఫికేషన్స్

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై నడుస్తుంది. హ్యాండ్ సెట్ 4జీబీ ర్యామ్ ని అందిస్తుంది. ఇది 3జీబీ వరకు వర్చువల్ ర్యామ్ మద్దతు కలిగి ఉంది. 64 జీబీ అంతర్గత నిల్వ సామర్థ్యం. మైక్రో ఎస్డీ కార్డ్ ఉపయోగించి దీనిని పెంచుకోవచ్చు. 6.7 అంగుళాల ఎఫ్ హెచ్ఢీ, అమోల్డ్ స్క్రీన్ తో వస్తుంది. ఫోన్ డిస్ ప్లే 108పీ కంటెంట్ ని చూడడానికి వైడ్ వైన్ ఎల్ 1 సర్టిఫికెట్ పొందింది. స్మార్ట్ ఫోన్ ముందు భాగంలో 8మెగా పిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉ:ది. కెమెరా సిస్టమ్ 50 మెగా పిక్సల్ ప్రైమరీ సెన్సార్ తో ఎఫ్,1.75 ఎపర్చర్ తో పాటు డెప్త్ సెన్సార్, ఏఐ లెన్స్ ను కలిగి ఉంటుంది. ఇన్ ఫినిక్స్ నోట్ 12 ఐ.. 5,000 mAh బ్యాటరీతో, 33W ఫాస్ట్ చార్జింగ్ తో నడుస్తుంది. బ్లూటూత్ 5.0, వైఫై 4జీ, డ్యూయల్ సిమ్, జీపీఎస్.. మరికొన్ని కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 9,999. మెటావర్స్ బ్లూ, ఆల్పైన్ వైట్, ఫోర్స్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఆండ్రాయిడ్‌లో గూగుల్ భారీ మార్పులు

 Smart Watch : వాయిస్ అసిస్టెంట్, మెటల్ బాడీ ఫీచర్స్, అదరగొడుతున్న ఫైర్‎బోల్ట్ స్మార్ట్‎వాచ్ లుక్..!!