భారత మార్కెట్లోకి ‘ఇన్ఫీనిక్స్ నోట్ 7’ - MicTv.in - Telugu News
mictv telugu

భారత మార్కెట్లోకి ‘ఇన్ఫీనిక్స్ నోట్ 7’

September 17, 2020

phonn

హాంకాంగ్‌కు ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారుదారు ఇన్ఫీనిక్స్ భారత మార్కెట్ లో మరో ఫోన్ ను లాంచ్ చేసింది. ఇప్పటికే ఎన్నో ఆకర్షనీయ మోడల్స్ ను తీసుకొచ్చిన ఇన్ఫీనిక్స్.. తాజాగా నోట్ 7 పేరుతో మరో ఫోన్ ను భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 6.95 అంగుళాల పెద్ద డిస్‌ప్లే, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, ఆక్టాకోర్ ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 

ఈ ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్‌లో మాత్రమే లభ్యం కానుంది. దీని ధరను రూ.11,499గా నిర్ణయించారు. సెప్టెంబర్ 22 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో మొదటి సేల్ మొదలవుతుంది.

 

ఇన్ఫీనిక్స్ నోట్ 7 ఫీచర్లు

 

* 6.95 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే,

* 4జీబీ ర్యామ్,

* 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,

* మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్,

* 48+2+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్,

* 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* 5,000ఎంఏహెచ్ బ్యాటరీ,

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్.